అయోధ్యలో (#Aydhya Rama Mandir) ఈనెల 22న జరిగే శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వెయ్యికళ్ళతో చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు దేశ, విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో సెలవులు ఇస్తే… మరికొన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు మన దేశంలోనూ జనవరి 22నాడు ఉత్తరప్రదేశ్ లో సెలవు ప్రకటించారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ డిమాండ్స్ వస్తున్నాయి. ఇక 48శాతం దాకా హిందువులు ఉంటే మారిషస్ అయితే మధ్యాహ్నం తర్వాత సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. పూజా కార్యక్రమాలను చూడటానికి రెండు గంటలు టైమ్ ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. మనదేశంలో 4కే టెక్నాలజీతో డీడీలోని వివిధ ఛానళ్ళలో అనేక భాషల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట సందర్భంగా అమెరికాలో దాదాపు 10 రాష్ట్రాల్లో 40కి పైగా భారీ బిల్ బోర్డులు తయారు చేయించి ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం టెక్సాస్, న్యూయార్క్, ఇల్లినాయిస్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. అమెరికాలోని హిందువులు భారీగా కారు ర్యాలీలు కూడా చేపడుతున్నారు. ఇక మారిషస్ లో అయితే దేశమంతటా 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ర్యాలీలు, చారిత్రక, ముఖ్యమైన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించడం, ముఖ్యమైన కూడళ్ళలో LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మారిషస్ లో 68 శాతం వరకూ భారత సంతతికి చెందినవారే ఉన్నారు. 22 నాడు దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ లో 22 నాడు సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట.. 22నే ఎందుకంటే!
అయోధ్యలో పది రోజుల ముందే పండగ వచ్చింది. రామమందిరం ప్రాణప్రతిష్ట సందర్భంగా… సరయూ నదీ తీరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముఖ్యమౌన కూడళ్ళల్లో రామచరిత మానస్, శ్లోకాలతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అలాగే తప్పినపోయిన వారిని కనిపెట్టేందుకు లాస్ట్ అండ్ ఫౌండ్ హెల్ప్ సెంటర్లు ప్రారంభించబోతున్నారు. రామమందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా రామచరిత మానస్ పుస్తకాలు, ఆడియో, వీడియోలకు డిమాండ్ పెరిగింది. 50యేళ్ళల్లోనే మొదటిసారిగా రామచరిత మానస్ పుస్తకాలు అమ్ముతున్నట్టు గీతా ప్రెస్ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకూ నెలకు 75 వేల కాపీలు అమ్ముతుంటే… ఇప్పుడు లక్షకు పైగా ప్రింట్ చేస్తున్నామన్నారు. స్టాక్ అస్సలు ఉండటం లేదంటున్నారు. సుందర కాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలు కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.