Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..

దేశవ్యాప్తంగా ఘనంగా ఈ ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంతకుమించి.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వివిధ హిందూ సంఘాలు అనేక దేశాల్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 05:44 PM IST

Ayodhya Ram Mandir: ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం అయోధ్య (ayodhya) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఏడు వేల మందికే ఆహ్వానం అందింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఘనంగా ఈ ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంతకుమించి.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర వీఐపీ పాస్‌లు.. ఆశపడ్డారో అంతే..!

వివిధ హిందూ సంఘాలు అనేక దేశాల్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జనవరి 21న రామ రథయాత్ర జరగనుంది. అక్కడి హిందూ వర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 21 మధ్యాహ్నం 12.30 గంటలకు ప్లేస్ డి లా చాపెల్లె నుంచి ఈ రామ రథయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటలకు ప్లేస్ డి ట్రోకాడెరో వద్ద ముగుస్తుంది. అమెరికాలోనూ పలు చోట్ల ఈ వేడుకలు జరగనున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో అక్కడి హిందువుల ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక భారీ కార్ ర్యాలీ జరిగింది. స్థానికంగా ఉన్న 11 హిందూ దేవాలయాల వద్ద ర్యాలీని నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర పొడవునా రామ భక్తులు భజనలు ఆలపిస్తూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ సాగారు.

అమెరికాలోని పలు దేవాలయాల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సం పురస్కరించుకుని వారం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలీకాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.