BCCI : 18760 కోట్లు బీసీసీఐ సంపాదన..

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్‌ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతీ ఏటా తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది. క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుతం బీసీసీఐ నెట్‌ వర్త్‌ 2.25 బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 18760 కోట్లు.

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్‌ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతీ ఏటా తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది. క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుతం బీసీసీఐ నెట్‌ వర్త్‌ 2.25 బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 18760 కోట్లు.  కాగా ఇతర ఏ క్రికెట్‌ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో లేదు. భారత క్రికెట్‌ బోర్డు తర్వాత రెండో స్ధానంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక అదాయం 79 మిలియన్‌ డాలర్లు అంటే, 660 కోట్లు.  అంటే ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు ఉంది. ఈసీబీ నెట్‌వర్త్‌ 59 మిలియన్‌ డాలర్లు, ఇండియా కరెన్సీలో ఇది సుమారు రూ.490 కోట్లకు సమానం.