Bharat Rice: రేపటినుంచి మార్కెట్లోకి రాబోతున్న భారత్ రైస్.. కేజీ రూ.29..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనుంది.

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 07:25 PM IST

Bharat Rice: సామాన్యులకు కేంద్రం తీపి కబురు అందించింది. తక్కువ ధరలో అందుబాటులోకి తేనున్న భారత్ రైస్.. శుక్రవారం నుంచే మార్కెట్లోకి రానుంది. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలవారికి ఊరట కలగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. నా‌ణ్యత కలిగిన సోనా మసూరి, హెచ్ఎంటీ రైస్ కేజీ రూ.70-80 వరకు ధర పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు బియ్యం కొనేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది.

Ravela Kishore Babu: జంపింగ్ స్టార్‌.. ఐదేళ్లు.. ఐదు పార్టీలు జంప్‌.. అయినా ఆ నమ్మకం లేకపాయె…

పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతున్నాయి. పంట దిగుబడి తగ్గడం కూడా దీనికి ఒక కారణం. అందుకే బియ్యం ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. విదేశాలకు బియ్యం ఎగుమతులు, బహిరంగ మార్కెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించింది. అయినప్పటికీ ధరలు దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనుంది. కేజీ రూ.29కే భారత్ రైస్ అందించనుంది. శుక్రవారం నుంచే భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది. సబ్సిడీ ద్వారా ఈ బియ్యం వినియోగదారులకు అందుతుంది. ఇప్పటికే పప్పుల్ని కూడా భారత్ దాల్ పేరుతో కేజీ రూ.60కే అందిస్తోంది. అలాగే గోధుమ పిండిని కూడా కేజీ రూ.27.5కే విక్రయిస్తోంది. ఇప్పుడు బియ్యాన్ని కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. ప్రత్యేక రిటైల్ ఔట్‌లెట్లలో ఈ బియ్యాన్ని విక్రయిస్తారు.

నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భాండార్స్ వంటి ఏజెన్సీల ద్వారా మొదట రిటైల్ విక్రయాలు సాగుతాయి. భారత్ రైస్‌ను ఎక్కువ ధరకు అమ్మినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే విదేశాలకు బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమకు కలిసొస్తుందని కూడా బీజేపీ భావిస్తోంది.