వివాదాలను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకొని తిరిగే నటి కంగనా రనౌత్.. ఎంపీ అయ్యాక కూడా తీరు మార్చుకోవడం లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. దీంతో బీజేపీ ఫైర్ అయింది. ఈ బ్యూటీ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలపై కన్నెర్ర చేసింది. రైతు ఆందోళనపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే…. బంగ్లాదేశ్ లాంటి పరిస్ధితి మన దేశంలోనూ వచ్చి ఉండేవంటూ కంగనా రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. రైతుల ఉద్యమ సందర్భంలో కంగనా ఇచ్చిన ప్రకటన.. తమ పార్టీ అభిప్రాయం కాదని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ తరఫున కంగనాకు… పార్టీ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి, అధికారం లేదని నోటీసు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని కంగనాను బీజేపీ ఆదేశించింది. అప్ట్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో… డెడ్ బాడీలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని… ట్విట్టర్ వేదికగా కంగనా ఓ వీడియో షేక్ చేసింది. సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నా… నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారు ప్రోత్సహించారని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మన దేశంలో కూడా అదే జరిగే అవకాశం ఉందన్నారు. విదేశీ శక్తులు దీనికి కుట్ర పన్నారంటూ ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికే పట్టదని విమర్శలు చేశారు. దీంతో కంగనా చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలోనే దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని తెలిపింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయద్దంటూ కంగనాకు గట్టిగానే క్లాస్ పీకింది. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. రైతుల గురించి మాట్లాడే హక్కు, అధికారం కంగానకు లేదని తెలిపింది. ఆమె వ్యాఖ్యలను వ్యక్తిగతంగా పరిగణించాలని వివరించింది.