Loksabha Speaker : స్పీకర్ పోస్ట్ కి రెండు పార్టీల డిమాండ్.. పురందేశ్వరికి దక్కుతుందా ?

కేంద్ర కేబినెట్ (Union Cabinet) కొలువుదీరింది. ఇప్పుడు అందరి దృష్టీ లోక్ సభలో స్పీకర్ పోస్టుపై పడింది. టీడీపీ, జేడీయూ ఈ పోస్టును తమకు ఇవ్వాలంటే తమకు అని పట్టుబడుతున్నాయి.

 

 

కేంద్ర కేబినెట్ (Union Cabinet) కొలువుదీరింది. ఇప్పుడు అందరి దృష్టీ లోక్ సభలో స్పీకర్ పోస్టుపై పడింది. టీడీపీ, జేడీయూ ఈ పోస్టును తమకు ఇవ్వాలంటే తమకు అని పట్టుబడుతున్నాయి. మోడీ మూడో ప్రభుత్వానికి… బ్యాక్ బోన్ గా నిలిచిన ఈ రెండు పార్టీలకు రెండేసి కేబినెట్ పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంది బీజేపీ. అందుకే ఎంతో కీలకమైన స్పీకర్ పోస్ట్ కావాలని టీడీపీ (TDP), జేడీయూ (JDU) డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ (BJP) మాత్రం ఆ పోస్ట్ ని వదులుకోడానికి ఇష్టపడటం లేదు.

లోక్ సభ స్పీకర్ పోస్టుకు ఫుల్లు డిమాండ్ ఉంది. గతంలో రెండు సార్లు NDA కూటమి (NDA Alliance) లో బీజేపీకి క్లియర్ మెజారిటీ ఉండటంతో స్పీకర్ పోస్టుల్లో తమ వాళ్ళనే నియమించుకుంది. మొదట సుమిత్రా మహాజన్… తర్వాత ఓం ప్రకాశ్ బిర్లా (Om Prakash Birla) స్పీకర్లుగా పనిచేశారు. వీళ్ళిద్దరూ ప్రతిపక్షాలను అణచివేయడంలో ముందున్నారనే టాక్ ఉంది. భారీగా ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు మూడోసారి బీజేపీకి అంతంతమాత్రమే మెజారిటీ ఉంది. అందువల్ల గతంలో కంటే బీజేపీకి స్పీకర్ పోస్ట్ (Speaker post) అవసరం ఇప్పుడు చాలా ఉంది.

అసలు లోక్ సభ స్పీకర్ పోస్ట్ కి ఎందుకంత డిమాండ్ అంటే… పార్టీలను చీల్చి ఎంపీలను తమ వైపునకు తిప్పుకోడానికి వీళ్ళే ప్రధాన ఆధారం. కేంద్రంలోనే కాదు… చాలా రాష్ట్రాల్లోనూ స్పీకర్లే చక్రం తిప్పిన సందర్భాలున్నాయి. అందుకే… బీజేపీకి ఈ పోస్ట్ తప్పనిసరి అయింది. ఈ పోస్టుకి ఈసారి బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసినా… ఈసారి కేబినెట్ లో చోటు ఇవ్వలేదు మోడీ. పురందేశ్వరిని స్పీకర్ గా చేస్తారని అంటున్నారు. దాంతో టీడీపీ డిమాండ్ కు చెక్ పెట్టడమే కాకుండా… దక్షిణాదికి ప్రియారిటీ ఇచ్చామని చెప్పుకోడానికి బీజేపీకి అవకాశం ఉంటుంది. మరి టీడీపీ, జేడీయూని బీజేపి లీడర్లు ఎలా ఒప్పిస్తారన్నది చూడాలి. డిప్యూటీ స్పీకర్ పోస్టు మాత్రం ఈసారి కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఈరెండు పోస్టులూ NDAయేనే తీసుకుంది. ఈసారి డిప్యూటీ మాత్రం అపోజిషన్ కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.