KCR : నష్టం జరిగింది..ఇప్పుడేం చేయలేం..! KCRతో తేల్చిచెప్పిన ప్రశాంత్ కిషోర్

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ కు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టమేనని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ కు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టమేనని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. మూడు గంటలకు పైగా కేసీఆర్ తో చర్చలు జరిపిన తర్వాత బయటకువచ్చిన ఫలితం ఇది. పీకే, కేసీఆర్ తో భేటీ అయ్యారనేది గురురాజ్ అంజన్ ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది. బీఆర్ఎస్ ను నమ్మేస్థితిలో జనం లేరు, ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదని సీఎంకు.. పీకే వివరించినట్టు సమాచారం. లేటెస్ట్ ఫ్లాష్ సర్వేకు సంబంధించి వివరాలను కూడా కేసీఆర్, కేటీఆర్ కు రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Kishan Reddy: దళితుడిని సీఎం చేసే దమ్ముందా.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్..

తెలంగాణలో BRS మళ్ళోసారి అధికారంలోకి రాదు.. జనంలో అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. పోలింగ్ నాటికి అది మరింత తీవ్రమయ్యే ఛాన్సుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మొత్తం సీన్ మారిపోతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ హామీల బూచీ చూపించి తలకిందులుగా తపస్సు చేసినా గెలవడం కష్టమేనని తెలుస్తోంది. ప్రజలు గులాబీ పార్టీని అస్సలు నమ్మడం లేదు. గ్రౌండ్ పిక్చర్ క్లియర్ గా ఉంది.. 3 నెలల్లోనే చాలా నియోజకవర్గాల్లో జనం ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. 9యేళ్ళ పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ వివరించినట్టు తెలిసింది. కాంగ్రెస్ విషయంలో జనంలో పాజిటివ్ టాక్ నడుస్తోంది. నష్టం ఎలాగూ జరిగింది.. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సీట్లు అయినా గెలిచేలా వ్యూహం ఇవ్వాలని ప్రశాంత్ కిశోర్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. అందుకోసం పీకే కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ సూచించారని అంటున్నారు.

CHANDRABABU NAIDU: చంద్రబాబు జనంలోకి వచ్చేదెప్పుడు ? మళ్ళీ అరెస్ట్ అవుతారా..?

2018 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ తో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈసారి ఆ డీల్ కంటిన్యూ కాలేదు. పైగా కేసీఆర్ కంటే మించిన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఎవరున్నారు అనే ధీమా పార్టీ లీడర్లలో కనిపించింది. మాకు వ్యూహకర్తలు ఎవరూ లేరు అంటూ గొప్పలు చెప్పుకున్నారు. గ్రౌండ్ రియాలిటీ కోసం ఐప్యాక్ తో కొన్ని సర్వేలు మాత్రం చేయించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. పోలింగ్ ఇంకా వారం ఉందనగా… ఇప్పుడు పీకే సహకారం కోరారు కేసీఆర్, కేటీఆర్. ఆయన చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు అయోమయంలో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం.

బీఆర్ఎస్ లో ఓటమి భయం పట్టుకుంది అనడానికి సిరిసిల్ల కేడర్ తో మంత్రి కేటీఆర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సాక్ష్యంగా కనిపిస్తోంది. మనంతట మనమే ఓడిపోతామనే ప్రచారం చేసుకోవద్దు. మౌత్ టాక్ తో ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.. ఈ వారం రోజులు నాకోసం కష్టపడండి.. అంటూ బీఆర్ఎస్ కేడర్ ను కేటీఆర్ బతిమలాడుకుంటున్న ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇన్నాళ్ళు జనానికి దూరంగా ఉన్నామని కేటీఆర్ కు ఇప్పుడు తెలిసొచ్చింది. హైదరాబాద్ లేదంటే ప్రగతిభవన్ లో కూర్చుంటే నియోజకవర్గ జనం ఓట్లేయరని కూడా అర్థమైనట్టు ఉంది. అందుకే సిరిసిల్ల జనానికి దగ్గరగా ఉంటా.. వారంలో రెండు రోజులు నియోజకవర్గానికి కేటాయిస్తానని కూడా పార్టీ కేడర్ కు కేటీఆర్ చెప్పుకోవడం ఆ ఆడియోలో వినిపించింది.

మొత్తానికి పథకాలు అందరికీ చేరకపోవడం, కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, అగ్రనేతలు జనానికి దూరంగా ఉంటూ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కే పరిమితం అవడం లాంటి అంశాలు బీఆర్ఎస్ పై బాగానే ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే టైమ్ లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 60 హామీలు తెలంగాణ ఓటర్లను ఆ పార్టీ వైపు మళ్ళించినట్టు అర్థమవుతోంది.