Delhi Air Pollution: ఢిల్లీ కాలుష్యంతో క్యాన్సర్.. దారుణంగా ఎయిర్ క్వాలిటీ..

వాయుకాలుష్యంతో వివిధ రకాల క్యాన్సర్లు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందనీ, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 6, 2023 / 02:04 PM IST

Delhi Air Pollution: ఢిల్లీ (Delhi)ని ముంచెత్తిన గాలి కాలుష్యం (Air Pollution) అక్కడి ప్రజల ప్రాణాలకు డేంజర్‌గా మారింది. ఢిల్లీతో పాటు NCR ఏరియాలోనూ గాలి నాణ్యత బాగా పడిపోయింది. దాంతో మళ్ళీ వాహనాలనకు బేసీ-సరి సంఖ్య విధానం అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కార్ భావిస్తోంది. వారం రోజులుగా ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పొగమంచుతో కూడిన వాతావరణ కనిపిస్తోంది. ఇంకా కొంతకాలం ఇలాగే కొనసాగితే మానవ శరీరంతో పాటు మొత్తం ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వాయుకాలుష్యంతో వివిధ రకాల క్యాన్సర్లు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందనీ, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న వాయు కాలుష్యం గర్భిణీలకు అయితే మహా డేంజర్. గర్భంలో ఉన్న పిండం ఎదుగుదలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదివారం నాడు 410 గా నమోదైంది. ఇంకా కొన్ని ఏరియాల్లో 385 దాకా పడిపోయాయి. ప్రస్తుతం అత్యంత తీవ్ర కేటగిరీలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ నమోదు అవుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ ప్రాథమిక స్కూళ్ళల్లో ఈనెల 10 దాకా సెలవులను పొడిగించింది. 6 నుంచి 12 వరకూ స్కూళ్ళు తెరచి ఉంచుతున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోడానికి అనుమతి ఇచ్చింది కేజ్రీ సర్కార్.

దాంతో చాలా స్కూళ్ళు ఆన్‌లైన్లో క్లాసులు పెట్టాయి. అలాగే ఔట్‌డోర్ యాక్టివిటీస్ కూడా బంద్ చేశారు. మళ్ళీ వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోకి కమర్షియల్ ట్రక్కులను నిషేధించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే ఆలోచన కూడా చేస్తోంది ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్యానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలే కారణమని కేజ్రీ సర్కార్ ఆరోపిస్తోంది.