DELHI LIQOUR SCAM: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వచ్చేవారం ఇద్దరు పెద్దలు అరెస్ట్ అవుతారన్న టాక్ ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది. అందులో మొదటి వ్యక్తి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సెకండ్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నందుకు కేజ్రీవాల్‌ని.. బీఆర్ఎస్‌తో పొత్తు లేదని చెప్పడానికి కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికి 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. ఢిల్లీ సీఎం ఏదో ఒక కారణంతో విచారణకు అటెండ్ అవ్వడం లేదు. పైగా కాంగ్రెస్‌తో సీట్స్ షేరింగ్ కూడా కుదుర్చుకున్నారు.
PAWAN KALYAN: ఎంపీగా పవన్..? పవన్ నిర్ణయంతో పిచ్చెక్కిపోతున్న జనసైనికులు
అందుకే రెండు, మూడు రోజుల్లో కేజ్రీ అరెస్ట్ తప్పదని ఆప్ మంత్రులు చెబుతున్నారు. బీజేపీ ఏం చేసినా మేం రెడీ.. మీ చేతనైంది చేసుకోండి అంటూ ఆప్ లీడర్లు ఫైర్ అవుతున్నారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే.. ఢిల్లీలో జనం రోడ్ల మీదకు వస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక కవిత సంగతి చూస్తే.. కవిత కూడా ఈడీ ఎంక్వైరీపై సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నారు. ఈనెల 28న ఆ కేసు హియరింగ్ ఉన్నా.. అంతకు రెండు రోజుల ముందే సీబీఐ ఎంక్వైరీకి పిలిచింది. పైగా గతంలో ఆమెను సాక్షిగా ప్రశ్నించినా.. ఇప్పుడు నిందితురాలిగా చేర్చింది. అప్రూవర్‌గా మారిన రాఘవరెడ్డితో పాటు కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సాక్షి కాస్తా నిందితురాలుగా మారింది. అందుకే 41A నిబంధన కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తే.. ఎవరైనా సరే.. సీబీఐ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే.. కోర్టు ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం సీబీఐకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కవితను కూడా అరెస్ట్ చేస్తారా ?
TDP-JANASENA LIST: యూత్ ఓట్ల కోసమే.. 63మంది డిగ్రీ-30 మంది పీజీ.. అయినా యువతకి దక్కని సీట్లు !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక.. కమలం పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. గతంలో ఈ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను పిలిచి విచారించడమే గానీ.. అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీపై జనం కూడా డౌట్ పడ్డారు. ఈ మౌత్ టాక్‌తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావు దెబ్బ తిన్నది. రేపు లోక్‌సభ ఎన్నికల్లో తమకీ గులాబీ పార్టీకి ఏ సంబంధం లేదని గట్టిగా చెప్పేందుకే కవితను అరెస్ట్ చేస్తారని అంటున్నారు. బీజేపీతో గూడపుఠాణి చేయడానికి ఓపిక ఉన్నా లేకున్నా.. కర్ర పట్టుకొని అయినా ఢిల్లీ వెళ్దాం అనుకున్నారు కేసీఆర్. కానీ సీబీఐ దూకుడు.. ఢిల్లీలో బీజేపీ పెద్దల వైఖరి గమనించాక.. కేసీఆర్ హస్తిన టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
పింక్ పార్టీతో తమకు ఫెవికాల్ బంధం లేదు అని చెప్పుకోడానికి అయినా ఈనెల 26న కవిత అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో ఉండొచ్చు అన్న టాక్ కూడా నడుస్తోంది. గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన రాఘవ రెడ్డి.. 6 నెలల తర్వాత గానీ బయటకు రాలేదు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అయితే జైలుకెళ్ళి ఈనెల 26కు ఏడాది పూర్తవుతుంది. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. రి కవిత పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు మొదలైంది.