PM Kisan : కేంద్ర బీజేపీ దేశ రైతాంగానికి శుభవార్త.. పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపు.. ఎంతంటే..?

దేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ ఓ శుభ వార్త చెబుతోంది. దేశంలో రైతులకు ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం, ఇటు గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకోంచిన విషయం తెలిసిందే.. రైతులు భూములను సాగు చేసి వ్యవసాయం చేసేందుకు ఒకరికి చేయి చాపకుండా.. అప్పుల నుంచి తప్పించేందుకు దేశంలో ప్రతి రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం పలు పథకాలు చేస్తుంది. రకరకాల స్కీమ్ లను ప్రవేశపెడుతూంది.

దేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ ఓ శుభ వార్త చెబుతోంది. దేశంలో రైతులకు ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం, ఇటు గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకోంచిన విషయం తెలిసిందే.. రైతులు భూములను సాగు చేసి వ్యవసాయం చేసేందుకు ఒకరికి చేయి చాపకుండా.. అప్పుల నుంచి తప్పించేందుకు దేశంలో ప్రతి రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం పలు పథకాలు చేస్తుంది. రకరకాల స్కీమ్ లను ప్రవేశపెడుతూంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఒకటి. దేశంలో ప్రతి రైతుకు ఆర్ధిక సాయం అందిచడంమే ఈ పథకం లక్ష్యం. తాజాగా పీఎం కిసాన్ ఆర్థిక సాయం ను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తిగా ప్రతి రైతుకు మూడు విడతలుగా ఒక సంవత్సరంలో రూ.6000 లను అందిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన నివేదికల ప్రకారం.. రైతులకు ఈ మొత్తాన్ని రూ.8,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.8000లను నాలుగు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సిఎన్‌బిసి టివి 18 వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. ఈ నివేదిక ప్రకారం లోక్‌సభకు ముందు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15 విడతల్లో ఆర్థిక సాయం అందించింది. తాజాగా 16వ విడత ద్వారా రైతులకు ఆర్ధిక సాయం ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల మధ్యలో రైల కతాలో జమకానున్నాయి.

  • పీఎం కిసాన్ ఆర్థిక సాయం పొందిన కారణం ఇదేనా..?

కాగా గత  సార్వత్రిక ఎన్నికల ముందు పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. దేశ రైతుల ఓట్ బ్యాంక్ కోసం.. వారి ఓట్లను రాబట్టుకునేందుకు.. పీఎమ్ కిసాన్ పథకం కు 2 వేలు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.