Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర ఆలయం నిర్మాణం.. చూద్దాం రండి.

ఎప్పుడెప్పుడాని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా.. హట్టహాసంగా ఈ భూమిపై ఎన్నడూ జరగని విధంగా అయోధ్య రాములోరి ఆలయ ప్రారంభోత్సవం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులందరు 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి దాదాపు 130 దేశాల నుంచి అథితులు రాబోతున్నారు.

1 / 47

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య పేరు మార్మొగుతుంది. ఎక్కడ చూసినా రామ నామ జపపమే వినిపిస్తోంది.

2 / 47

అయోధ్య ఆలయ నిర్మాణంకు పునాధులు తీస్తున్న చిత్రం

3 / 47

యావత్‌ దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా.. భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు జనవరి 22న తెర పడనుంది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

4 / 47

జనవరి 22, అనగా సోమవారం మధ్యాహ్నం నాడు నరేంద్ర ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

5 / 47

ఈ ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాక.. విదేశాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి రానున్నారు.

6 / 47

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు యోగి సర్కారు చర్యలు తీసుకుంటుంది.

7 / 47

ఈ క్రమంలో ప్రస్తుతం అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చయ్యింది

8 / 47

ప్రపంచ వ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసం దేశ, విదేశాల నుంచి నిధులు సేకరించారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చారు.

9 / 47

అయోధ్యలో 2020లో రామ మందిరానికి శుంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత.. ఆలయ నిర్మాణం కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించారు.

10 / 47

గర్భాలయం గోపురం..

11 / 47

2021లో 44 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది.

12 / 47

ఇక కేవలం విరాళాల రూపంలోనే సుమారు రూ. 2,100 కోట్లను సేకరించినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సభ్యులు వెల్లడించారు.

13 / 47

వాస్తవంగా అయితే విరాళాల రూపంలో కేవలం రూ. 1000 కోట్లు వస్తాయని ట్రస్ట్​ అంచనా వేసింది. కానీ.. అంచనాలకు మించి, మరో రూ. 1,100 కోట్లు అధికంగా వచ్చాయి.

14 / 47

అయితే విరాళాల సేకరణకు గడువు ముగిసిన తర్వాత కూడా భారీ ఎత్తున నిధులు వచ్చాయని.. ప్రస్తుతం అవి 3 వేల కోట్ల రూపాయాలకు పైగానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

15 / 47

అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలు, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది కానీ.. ప్రభుత్వం నుంచి మాత్రం ఆలయ నిర్మాణానికి పెద్దగా నిధులు ఇవ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

16 / 47
17 / 47

మందిర నిర్మాణానికి జనాల నుంచి సేకరించిన విరాళాలు మాత్రమే కాక కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది.

18 / 47

కొన్ని ప్రముఖ కార్పొరేట్​ సంస్థలు.. రామ మందిర నిర్మాణంలో తమ వంతు తోడ్పాటు అందించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

19 / 47

పలు సంస్థలు.. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక రకాల పరికరాలు, సామాగ్రి ఇచ్చినట్టు సమాచారం.

20 / 47

రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఖర్చులపై ట్రస్ట్​ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కానీ.. లెక్కలు కానీ బయటకు రాలేదు. కాగా ఆలయ నిర్మాణానికి రూ. 1,800 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత అంచనా వేశారు.

21 / 47

గర్భాలయం లో పనులను పరీశీలీస్తున్న యూపీ సీఎం యోగి.

22 / 47

నిర్మాణం, యంత్రాలు, ముడిసరుకు​, కార్మికులు, ఇతర అడ్మినిస్ట్రేటివ్​ ఖర్చులన్ని కలుపుకుని ఈ మొత్తాన్ని అంచనా వేశారు.

23 / 47

నిర్మాణ ఇటుక పై శ్రీరామ నామం

24 / 47

ఆలయ గోడలను మొక్కుతున్న రామ భక్తులు

25 / 47

ప్రధాన.. విగ్రహాలకోసం నేపాల్ నుంచి తీసుకోచ్చిన బండ రాతి బండలు

26 / 47

నేపాల్ లో చాలా అరుదుగ దోరికే బండ రాతులు

27 / 47

అయితే నిర్మాణం మొదలయ్యాక ఖర్చులు భారీగా పెరిగాయని.. ఇప్పటి వరకు సుమారు రూ. 3,200 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిపై స్పష్టత రాదు.

28 / 47

ఆలయ నిర్మాణ కార్మీకులు

29 / 47

2023 అక్టోబర్​ నాటికి.. విరాళాల రూపంలో మందిర నిర్మాణానికి లభించిన మొత్తం డబ్బుల్లో రూ. 900 కోట్లు ఖర్చు అయ్యాయని.. మరో రూ. 3వేల కోట్లు బ్యాంక్​ ఖాతాల్లో ఉన్నట్టు ట్రస్ట్​ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు.

30 / 47

ఈ రూ. 900 కోట్లు ఆలయ నిర్మాణానికి మాత్రమే ఖర్చైనట్టు తెలిపారు.

31 / 47

ట్రస్ట్​ ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన వాటిల్లో ముందు వరుసలో ఉండేది.. ఆలయ నిర్మాణం.

32 / 47

తర్వాతి ఖర్చు.. అదనపు భూమిని కొనుగోలు చేయడం, దానిని అభివృద్ధి చేయడానికి అవుతుంది అంటున్నారు.

33 / 47

మందిర ప్రారంభోత్సవం తర్వాత.. ప్రతియేటా లక్షలాది మంది అయోధ్యను సందర్శిస్తారు. కాబట్టి.. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.

34 / 47

ఉద్యోగుల వేతనాలు, రవాణా, సమాచార వ్యవస్థ, ఆపరేటింగ్​ కాస్ట్​లు ప్రతియేటా ఉంటూనే ఉంటాయి. వీటన్నింటికి కూడా భారీగా ఖర్చు అవుతాయని భావిస్తున్నారు.

35 / 47

130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

36 / 47
37 / 47

24 గంటల పాటు పని చేయడం, దేశం నలుమూలల నుండి వచ్చిన నైపుణ్యం కలిగిన నైపుణ్యం, ఆ ప్రాంతంలోని ప్రత్యేక సాధనాలు రాముడి ఆలయాన్ని నిలబెట్టాయి.

38 / 47
39 / 47

రామాలయం ప్రాంగణం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది.

40 / 47

ఆలయ విస్తీర్ణం మొత్తం 67 ఎకరాలు. అసలు ఆలయం 2 ఎకరాల స్థలంలో ఉంది. గర్భగుడితో పూర్తి అయిన ఆలయం మొత్తం 3 మాలలను కలిగి ఉంటుంది.

41 / 47

ఒక్కో దండ ఎత్తు 20 అడుగులు. ఆలయ గర్భగుడి ఈ ప్రధాన శిఖరం కింద ఉంటుంది.

42 / 47

జనవరి 20న అక్షత ఉత్సవం, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది.

43 / 47

ప్రాణ్ ప్రతిష్ట కోసం, 22 జనవరి 12:29 సమయం నిర్ణయించారు.

44 / 47

దీని తర్వాత వచ్చే 48 రోజుల పాటు మండల పూజ నిర్వహిస్తారు.

45 / 47

రానున్న 7 నుంచి 8 నెలల్లో ఆలయ ప్రాంతంలో ఏడు వేర్వేరు ఆలయాలు నిర్మించనున్నారు.

46 / 47

ఇందులో మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద్ రాజ్, శబ్రీ, అహల్య, జటాయువుల ఆలయాలు ఉంటాయి.

47 / 47

అయోధ్య ఆలయం ముందు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి