Pawan Kalyan : పవన్ తప్పు చేశాడా..? తెలంగాణలో పోటీ ఎందుకు ..??

జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) .. పార్టీ నడపడంలో తరుచుగా తప్పటడుగులు వేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్పేది నిజమేనేమో అనిపిస్తుంది. కొన్ని సడన్ డెసిషన్స్ తో తన పార్టీని, కేడర్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి.

Pawan Kalyan :  జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) .. పార్టీ నడపడంలో తరుచుగా తప్పటడుగులు వేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్పేది నిజమేనేమో అనిపిస్తుంది. కొన్ని సడన్ డెసిషన్స్ తో తన పార్టీని, కేడర్ ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలో పెద్దలు, సలహాదారులతో సంప్రదించకుండా చేస్తున్నాడా.. అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.

ముందస్తు వ్యూహం లేకుండా 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( Andhra Pradesh Politics) ల్లోకి దిగిన జనసేన (Jana Sena) ఒక్కసీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యూహం లేని రాజకీయాలు ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయడం కూడా పెద్ద బ్లండర్ అంటున్నారు. పవన్ మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పూర్తిగా Concentration పెట్టాడు. తెలంగాణలో కొద్దో గొప్పో క్యాడర్ ఉన్నా.. ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. జనంలో బలం ఉందో లేదో కూడా తెలియదు. GHMC ఎన్నికల్లో అవకాశం వచ్చినా.. బీజేపీకి మద్దతు ఇచ్చాడే తప్ప.. తమ అభ్యర్థులను మాత్రం నిలబెట్టలేదు.

Telangana assembly elections : తెలంగాణలో జనసేన ఎంట్రీ.. ! బీసి సభలో మోడీ పక్కన పవన్

ఇప్పుడు సడన్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) బరిలోకి దిగాడు. ఇక్కడ పట్టుమని 10 ఓట్లు పడతాయా అంటే అనుమానమే. అభ్యర్థులని గెలిపించుకునే ఆలోచన కూడా లేదు. కానీ 9 సీట్లు కావాలని బీజేపీని డిమాండ్ చేశాడు పవన్ కల్యాణ్.. సరే.. 9 సీట్లు ఇస్తే.. అందులో ఒక్కటైనా జనసేన గెలుస్తుందా.. సాధ్యమేనా? నో అలాంటి పరిస్థితే లేదు.

ఎంతో ఆర్భాటంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. అన్ని సీట్లలో ఓడిపోతే.. రేపు ఏపీలో పరిస్థితి ఏంటి. అక్కడ అవమానభారంతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్. శక్తి లేని చోట శక్తి ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చి ఏపీలో ఎన్నికలకు ముందుగా.. అక్కడి ప్రజలు, కార్యకర్తల దగ్గర ఎందుకీ అవమానం? ఆ మాత్రం కనీసం నాలెడ్జ్ లేకుండా తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేయడం అనేది.. పవన్ కళ్యాణ్ చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం. తాను బిజెపితో కలిసి ఉన్నాననీ.. NDA లో భాగస్వామిని అని ప్రపంచానికి చెప్పడానికి తప్ప..ఈ ప్రయత్నం ఎందుకూ ఉపయోగపడదు.
తెలంగాణలో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తుంటే ఆ మెసేజ్ జనంలో మరోరకంగా వెళ్ళేది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కూటమికి గుర్తింపు ఉండేది.. కొద్దో గొప్పో మైలేజ్ వచ్చేది. కానీ టీడీపీని పూర్తిగా వదిలేసి.. జనసేన ఒక్కటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ తరచూ చేసే వ్యూహాత్మక తప్పిదాల్లో తెలంగాణలో పోటీ చేయడం ఒకటి అనుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.