7 states By-elections : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఎన్నికలు.. 13 అసెంబ్లీ సీట్లకు నేడు ఉప ఎన్నికలు..

దేశ వ్యాప్తంగా మరో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా.. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.

దేశ వ్యాప్తంగా మరో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా.. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవే. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంత మంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేశ్‌ ఠాకుర్‌ సహా పలువురి భవితను ఇవి తేల్చనున్నాయి. ఎన్నికలు జరగబోతున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌ దక్షిణ్‌, బాగాధ్‌, మనిక్‌టాలా (4), ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మాంగ్లౌర్‌ (2), పంజాబ్‌లోని జలంధర్‌ వెస్ట్‌ (1), హిమాచల్‌లోని డెహ్రా, హమీర్‌పూర్‌, నాలాగఢ్‌ (3), బీహార్‌లోని రూపాలి (1), తమిళనాడులోని విక్రవండి (1), మధ్యప్రదేశ్‌లోని అమర్వార్‌ (1) స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి.