AP Politics : పాలిటిక్స్ నుంచి.. ధర్మాన రిటైర్మెంట్ తప్పదా?

అభ్యర్థి ఎంపిక, టిక్కెట్‌ కేటాయింపు మీదే ఏ పార్టీకైనా సగం గెలుపు ఆధాపడి ఉంటుందన్నది రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు చెప్పే మాట. సాధారణ పరిస్థితుల్లో ఆ సిద్ధాంతాన్నే నమ్ముతాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్‌సభ సీటు విషయంలో ఆ సంగతిని సరిగా పట్టించుకోక దెబ్బతిన్నామన్న అభిప్రాయం ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వానికి కలుగుతోందట. అందుకే ఈసారి దిద్దుబాటు కార్యక్రమం మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అభ్యర్థి ఎంపిక, టిక్కెట్‌ కేటాయింపు మీదే ఏ పార్టీకైనా సగం గెలుపు ఆధాపడి ఉంటుందన్నది రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు చెప్పే మాట. సాధారణ పరిస్థితుల్లో ఆ సిద్ధాంతాన్నే నమ్ముతాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్‌సభ సీటు విషయంలో ఆ సంగతిని సరిగా పట్టించుకోక దెబ్బతిన్నామన్న అభిప్రాయం ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వానికి కలుగుతోందట. అందుకే ఈసారి దిద్దుబాటు కార్యక్రమం మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

TDP : డోన్ నియోజకవర్గం టీడీపీలో మారుతున్న ఈక్వేషన్స్.. కేఈ ఫ్యామిలీ రీ ఎంట్రీ.. ?

2019 జగన్‌ వేవ్‌లో సైతం మెజార్టీ తగ్గినా.. సిక్కోలు లోక్ సభ స్దానాన్ని నిలబెట్టుకుంది టీడీపీ. ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు హ్యాట్రిక్‌ ప్రయత్నాల్లో గట్టిగానే ఉన్నారట. నియోజకవర్గం పరిధిలో టీడీపీ క్యాడర్ బలంగా ఉండటంతోపాటు సామాజిక సమీకరణలు ఆయనకు కలిసివస్తున్నాయన్నది పొలిటికల్‌ పరిశీలకుల లెక్క. వెలమ సామాజికవర్గానికి చెందిన రామ్మోహన్‌నాయుడికి పోటీగా ఎప్పుడూ అదే కులానికి చెందిన నాయకుడు ప్రత్యర్థి పార్టీ నుంచి నిలబడలేదు. మంత్రి ధర్మాన ఫ్యామిలీది కూడా అదే సామాజికవర్గం అయినా.. వేర్వేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా ఉన్నా.. ప్రత్యక్షంగా ఢీకొన్న సందర్భాలు లేవు. తూర్పుకాపు, కాళింగ, వెలమలు శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజికవర్గాలు.

2014లో తూర్పు కాపుల నుంచి రెడ్డి శాంతిని, 2019లో కాళింగ కమ్యూనిటీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ను ఎంపీ అభ్యర్థులుగా బరిలో దింపి రెండు సార్లూ దెబ్బతింది వైసీపీ. 2019లో అయితే శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా.. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో ఎంపీ సీటు కోల్పోవాల్సి వచ్చిందట. జరగాల్సిన నష్టం జరిగిపోయాక లెక్కలేసుకున్న ఫ్యాన్‌ పార్టీ అగ్రనాయకత్వం ఈసారి ఎలాగైనాసరే.. వెలమ అభ్యర్థికే టిక్కెట్‌ ఇచ్చి సిక్కోలును కొట్టాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. అందుకే ధర్మాన ఫ్యామిలీకి ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది.

రామ్మోహన్‌ నాయుడిని కొట్టాలంటే అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులు మంత్రి ధర్మాన ప్రసాదరావుగానీ, ఆయన సోదరుడు కృష్ణ దాస్‌నిగానీ బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట. ఇద్దరిలో కూడా ఎంపీగా ప్రసాదరావు అయితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయన్నది వైసీపీ అధినాయకత్వపు ఆలోచనగా తెలిసింది. అందుకు సుతారమూ ఇష్టం లేని ప్రసాదరావు.. ఆ విషయం తెలిశాక పార్టీ కార్యక్రమాలతో సైతం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనీ.. తప్పనిసరిగా పాల్గొనాల్సిన పార్టీ సమావేశాలకు ఇలా వచ్చి.. అలా వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో క్యాడర్‌లో సైతం అనుమానాలు పెరుగుతున్నట్టు తెలిసింది.

గతంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కనుసైగలతో నడిపిన అనుభవం ఉన్న నాయకుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకుల్లో సైతం చర్చ జరుగుతోంది. అయితే మరోసారి అసెంబ్లీకే పోటీ చేయాలనుకుంటున్న ధర్మానను బలవంతంగా.. అస్సలు ఇష్టంలేని ఎంపీ సీటుకు పోటీ చేయమని అగ్ర నాయకత్వం కోరుతోందననీ.. అందుకే ఆయన పట్టీ పట్టనట్టుగా ఉంటున్నారని చెబుతున్నారు సన్నిహితులు. ఉంటే అసెంబ్లీ బరిలో ఉంటాను.. లేదంటే అసలు రాజకీయాల నుంచే రిటైర్‌ అవుతానని ప్రసాదరావు సన్నిహితుల దగ్గర అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి సామాజిక సమీకరణాల కోణంలో సిక్కోలు కోటలో పాగా వేయాలనుకుంటున్న వైసీపీ అధిష్టానం ధర్మానను బుజ్జగిస్తుందా? లేక అదే సామాజికవర్గానికి చెందిన మరో అభ్యర్థిని ఎంచుకుంటుందా అన్నది చూడాలి.