100మందిపై గ్యాంగ్‌రేప్‌.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు..

కోల్‌కతా హత్యాచార ఘటన.. దేశాన్ని కదిలిస్తోంది. డాక్టర్‌గా రెక్కలొచ్చి ఇప్పుడిప్పుడు ప్రపంచాన్ని చూస్తున్న ఓ డాక్టర్‌ కలలను, బతుకులను నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించాల్సిందేనని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 06:32 PM IST

కోల్‌కతా హత్యాచార ఘటన.. దేశాన్ని కదిలిస్తోంది. డాక్టర్‌గా రెక్కలొచ్చి ఇప్పుడిప్పుడు ప్రపంచాన్ని చూస్తున్న ఓ డాక్టర్‌ కలలను, బతుకులను నాశనం చేసిన దుర్మార్గుడు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించాల్సిందేనని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయ్. సంజయ్ రాయ్‌ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. డాక్టర్‌ మీద గ్యాంగ్‌రేప్ జరిగినట్లు అనుమానాలు వినిపిస్తున్నాయ్. దీంతో ఈ ఘోరం తెలిసిన ప్రతీ ఒక్కరి గుండె రగిలిపోతోంది. ఐతే కోల్‌కతా ఘోరం ప్రకంపనలు రేపుతున్న వేళ.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అజ్మీరా సెక్స్ స్కాండల్‌ కేసులో కీలక పరిణామం జరిగింది.

1992లో ఈ కేసుకు సంబంధించిన తీర్పును అజ్మీర్ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 18మంది దోషులుగా తేలగా.. వారిలో 9మందికి ఇప్పటికే శిక్ష పడింది. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు. ఒకడు పరారీలో ఉన్నాడు. అజ్మీర్ ఘోరం తలుచుకున్నా.. ఆలోచించినా.. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

ఆ దుర్మార్గులు అంతటి దారుణాలకు పాల్పడ్డారు. 1992లో అజ్మీర్‌లోని మాయో కాలేజీలో వంద మందికి పైగా విద్యార్థినులపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. నగ్న చిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. వేరే అమ్మాయిలను తీసుకునిరావాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా వందమంది అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది.

ఈ నగ్న ఛాయాచిత్రాల ఆధారంగా… ఈ ముఠా డబ్బు సంపాదించింది. దీంతో ఈ భారీ బ్లాక్ మెయిలింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల నగ్న చిత్రాలను ఇతరులకు షేర్ చేస్తూ అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పట్లో అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఫరూక్ చిస్తీ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉండేవాడు. నఫీస్ చిస్తీ, అన్వర్ చిస్తీ.. అతని దారుణాలకు అండగా నిలిచేవాడు. అజ్మీర్‌ ఘోరం వెలుగులోకి రాగానే.. మొదటగా ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. శిక్ష విధించారు.