Lok Sabha : లోక్ సభలో దాడి చేసింది అందుకేనా..? నిజాలు బయటపెట్టిన నిందితులు

లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.

లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.

లోక్ సభలో దాడికి ఆరుగురు నిందితులూ కలసి 18 నెలల ముందే ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసుల విచారణలో బయటపడింది. వీళ్ళల్లో ఐదుగురు అరెస్ట్ అవగా.. పారిపోయిన మరొకరి కోసం వెతుకుతున్నారు. ఈ దాడికి కారణాలేంటో నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస లాంటి అంశాలపై ఈ నిందితులు తీవ్ర అసహనంతో ఉన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం చర్చిస్తుందన్న ఉద్దేశ్యంతోనే ఈ దాడికి పాల్పడినట్టు నిందితులు చెబుతున్నారు. వీళ్ళంతా మంచి చదువులు చదువుకున్నవాళ్ళే. దర్యాప్తు సంస్థలు మాత్రం ఉగ్రవాద కుట్రకోణం ఏదైనా ఉందా.. ఎవరైనా వీళ్ళని ప్రేరేపించారా అని విచారణ చేస్తున్నారు.

నిందితుల వయస్సు 20 నుంచి 30యేళ్ళ లోపే ఉంది. వీళ్లంతా సోషల్ మీడియా పేజ్ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ ని ఫాలో అవుతున్నారు.. నిందితుల్లో కొందరు గతంలో మహిళా రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య పరిరక్షణ లాంటి అంశాలపై పోస్టులు పెట్టారు. ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీలు కూడా క్రియేట్ చేశారు. నీలం ఆజాద్, అమోల్ షిండే ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. లోక్ సభలోకి దూకిన ఇద్దరిలో ఒకడైన సాగర్ శర్మ లక్నోలో ఉంటున్నాడు. అతను భగత్ సింగ్, మార్కిస్ట్ భావాలు, చెగువేరాకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టాడు. జంప్ చేసిన వాళ్ళల్లో మరో వ్యక్తి మనోరంజన్.. కంప్యూటర్ ఇంజినీరింగ్ డిగ్రీ చేశాడు. మైసూర్ ఎంపీ నుంచి పాస్ తీసుకుంది ఇతనే. పార్లమెంట్ బయట ఆందోళన చేసిన నీలం ఆజాద్ ది హర్యానా. ఈమె ఎంఫిల్ డిగ్రీ తీసుకుంది. టీచర్ జాబ్ కి అవసరమైన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాసైంది.

2021లో కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నది ఆ తర్వాత బ్రిజ్ భూషన్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన ధర్నాలో నీలం ఉన్నది. పార్లమెంట్ ముందు అమోల్ షిండే ఆర్మీలో చేరాలనుకొని విఫలమయ్యాడు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందినవాడు. పోలీస్, ఆర్మీ టెస్టులకు ప్రిపేర్ అయ్యాడు. వాటిల్లో చాలాసార్లు ప్రయత్నించినా పాస్ కాలేదు. డిసెంబర్ 9న పోలీస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నడుస్తోందని చెప్పి.. ఇంటి నుంచి ఢిల్లీకి వచ్చినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక గుర్గావ్ లో నిందితులకు ఆశ్రయమించిన విక్కీ శర్మ అతని భార్య రేఖను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విక్కీ శర్మ ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న లలిత్ ఝా బీహార్ కు చెందిన వాడు.. పార్లమెంట్ బయట నీలం ఆజాద్, అమోల్ షిండే .. కలర్ స్మోక్స్ విసురుతూ.. నినాదాలు చేస్తుండటాన్ని వీడియోలు తీశాడు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. అందరి మొబైల్ ఫోన్లు…బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి పరార్ అయ్యాడు లలిత్. అందులో ఒక వీడియోను ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడికి పంపాడు. దాన్ని భద్రంగా ఉంచమనీ.. అలాగే మీడియా కవరేజికి ఇవ్వాలని అతనికి చెప్పినట్టు తెలిసింది.

లోక్ సభపై దాడిని సెక్రటరియేట్ తీవ్రంగా పరిగణించి.. ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. పార్లమెంట్ లో మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా భద్రతను పెంచుతోంది ప్రభుత్వం. ఎంపీలు, వాళ్ళ సిబ్బంది వెళ్ళడానికి ప్రత్యేక గేట్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియా సిబ్బంది, విజిటర్స్ ను నాలుగో గేటు నుంచి మాత్రమే అనుమతిస్తారు. లోక్ సభ, రాజ్యసభ విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకి దూకకుండా అద్దాలను ఫిట్ చేస్తున్నారు. అలాగే లోపలికి వెళ్ళేముందు స్కాన్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బందికి బాడీ స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు.. సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతున్నారు.