YS Jagan : ఢిల్లీ ధర్నాతో జగన్‌ సెల్ఫ్‌గోల్‌.. వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవా..

ఏపీలో అరాచక పాలన సాగుతుందని.. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారంటూ.. ఢిల్లీ వేదికగా నినదించారు వైసీపీ అధినేత చంద్రబాబు.

 

 

ఏపీలో అరాచక పాలన సాగుతుందని.. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారంటూ.. ఢిల్లీ వేదికగా నినదించారు వైసీపీ అధినేత చంద్రబాబు. హస్తిన వెళ్లి ఒకరోజు దీక్ష చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికే జగన్ ఈ కార్యకర్మం చేపట్టాడనే టాక్ అక్కడక్కడా వినిపిస్తున్నా.. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నుంచి మంచి స్పందన కనిపించింది. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ అయితే.. జగన్‌తో పాటు స్టేజీ ఎక్కి మరి.. చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పార్టీలన్నీ జగన్‌ వైపు నిలిచాయ్ దాదాపుగా! ఐతే ఇదే కొత్త చర్చకు కారణం అవుతోంది. ఢిల్లీలో దీక్ష చేపట్టి జగన్‌ సెల్ఫ్‌గోల్ వేసుకున్నాడా అనే అనుమానం మొదలైంది.

చంద్రబాబు సర్కార్ నిజంగానే అరాచకాలకు పాల్పడింది అనుకుంటే.. ఢిల్లీ వరకు వెళ్లి దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదు. చేస్తే చేశారు.. ఇండియా కూటమికి ఆహ్వానాలు పంపించాల్సి అవసరం అంతకన్నా లేదు. ఇదే ఇప్పుడు జగన్‌ సెల్ఫ్‌గోల్‌ వేసుకునే చేసిందనే చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్‌ వైపా.. ఇటు బీజేపీ వైపా.. జగన్‌ ఒకవైపు జరగాల్సిన సమయం వచ్చేసింది ఈ దీక్షతో ! బీజేపీ వైపు ఉండలేరు.. కాంగ్రెస్ వైపు ఉండకూడదు. ఇలా తయారైంది జగన్ పరిస్థితి ఇప్పుడు. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద జగన్ యుద్ధానికి దిగారు. అంటే బీజేపీ మీద వార్ ప్రకటించినట్లే ! ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వెనక అడుగు వేసే అవకాశం ఉండదు. దీంతో ఆయన ఎటు వైపు ఉంటారన్న ఆసక్తి కనిపిస్తోంది. 2014 నుంచి బీజేపీకి మద్దతుగా ఉంది వైసీపీ. ఇంకా చెప్పాలంటే.. అనధికారిక పొత్తు కొనసాగింది. పార్లమెంట్‌లో కీలక బిల్లుల సమయంలో బీజేపీకే మద్దతుగా నిలిచింది వైసీపీ. అలాంటిది 2024 ఎన్నికల టైమ్‌కు సీన్ మారింది. జనసేన, టీడీపీతో కలిసి ఏపీలో బీజేపీ కూటమిగా ఏర్పడింది.

ఈ కూటమి సర్కార్‌ మీద జగన్‌ ఢిల్లీలో ధర్నా చేశారు. ఇదే ఇప్పుడు జగన్‌ను ఇరుకునపెట్టినట్లు అవుతోంది. అసలే వైసీపీ పరిస్థితి అంతంతం మాత్రంగా ఉంది. గెలిచిన 11మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమయంలో పార్టీని కాపాడుకోవాలి అంటే.. నేషనల్‌ స్థాయిలో సపోర్ట్ అవసరం. వచ్చే ఐదేళ్లు పార్టీ సేఫ్‌గా ఉండాలి అంటే ఈ మద్దతు అవసరం. ఐతే ధర్నా పేరుతో తమ ప్రభుత్వం మీద చేసిన పోరాటానికి.. ఇండియా కూటమి నుంచి పార్టీలను ఆహ్వానించడాన్ని.. బీజేపీ అంత ఈజీగా తీసుకునే అవకాశాలు లేవు. జగన్‌ను దగ్గరకు రానిచ్చే చాన్స్ లేదు. పోనీ ఇండియా కూటమి వైపు వెళ్దామంటే.. ఏపీలో ఎన్డీఏ అలియెన్స్ సర్కార్ ఉంది. ఇండియా కూటమి వైపు మొగ్గితే.. వైసీపీని మరింత ఇబ్బంది పెట్టే చాన్స్ ఉంది. అటు కాదు.. ఇటు కాదు.. సింగిల్‌గా ఉందామా అంటే.. అది ఇంకా డేంజర్‌. ఇలా ఒక్క దీక్షతో జగన్‌.. తనకు తను సెల్ఫ్‌గోల్ వేసుకున్నాడని.. తర్వాత ప్రయాణం ఏంటో.. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే.. ఫ్యాన్‌ పార్టీకి అంత మంచిది అనే చర్చ జరుగుతోంది.