Jagan’s sensational comments : జగన్ సంచనల వ్యాఖ్యలు.. ఓడిపోయినా బాధపడను..!

ఎన్నికల ముందు అధికారం కోసం ఎన్నో ఎన్నో మాటలు, హామీలు, వ్యూహాలు వేస్తుంటారు. అధికార పార్టీ వారు కొంత మేరకు అయినా.. ప్రతిపక్షం వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. తాజాగా ఏపీ పాలిటిక్స్ లో అదే జరుగుతుంది.

ఎన్నికల ముందు అధికారం కోసం ఎన్నో ఎన్నో మాటలు, హామీలు, వ్యూహాలు వేస్తుంటారు. అధికార పార్టీ వారు కొంత మేరకు అయినా.. ప్రతిపక్షం వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. తాజాగా ఏపీ పాలిటిక్స్ లో అదే జరుగుతుంది. మరో రెండు, మూడు నెలలో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఎన్నికల ముందు తిరుపతి ఇండియా టుడే (India Today) సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు నేడు అధికారం నుంచి దిగిపోడానికి రెడీ అన్నారు ఏపీ సీఎం జగన్. 56 నెలలు అధికారంలో ఉన్నా బాగానే పనిచేశా.. ఎలాంటి విచారం లేదు… దిగిపోడానికి నేడు రెడీగా ఉన్నాను.

గతంలో గడిచిన రెండు మూడు నెలల్లో జగన్ నోట ఎలాంటి నిరాశ.. ఆందోళన కనిపించలేదు.. అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ మొదలైంది. మొదటిసారిగా కాంగ్రెస్ (Congress) పై సీఎం జగన్ (CM Jagan) విమర్శలు గుప్పించారు. రాష్ట్రానే.. కాకుండా కుటుంబాన్ని సైతం విభజించారని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. షర్మిల (YS Sharmila) ఏపీసీసీ చీఫ్ (APCC chief) కావడంతో కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. ఎడ్యుకేషన్ సదస్సులో తడబడ్డ జగన్.. ఇంటర్నేషనల్, ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. ఉన్నతవిద్య చదివినవారికి ఉపాధి మాటేంటన్న ప్రశ్నకు సీఎం జగన్ సమాధానం ఇవ్వలేదు. ఓ విద్యా సదస్సు లో రాజకీయ ప్రశ్నలు వేయడంపై పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు.