Jaya Prada: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద.. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ కోర్ట్‌లో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ కోసం కోర్టు.. జయప్రదకు పలుమార్లు నోటీసులు జారీచేసింది. కానీ, జయప్రద కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. విచారణకు హాజరుకాలేదు. తమ ఆదేశాల్ని ధిక్కరించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..
ఫిబ్రవరి 27న జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ క్రమంలో ఆమె కోసం పోలీసులు వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. తాజాగా సోమవారం ఉదయం జయప్రద.. తన లాయర్లతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టుకు చేరుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె నియమావళి ఉల్లంఘించిందనే కారణంతో ఆమెపై రెండు చోట్లా కేసులు నమోదయ్యాయి. రాంపూర్ పరిధిలోని కౌమరి, స్వార్ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ కోసం కోర్టు జయప్రదకు నోటీసులు జారీ చేసింది. ఏడుసార్లు పోలీసులు వారెంట్ జారీచేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఆమె ఎక్కడున్నా వెంటనే వెతికి తమ ముందు హజరు పర్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ, ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాలతో జయప్రద కోసం వెతికినా ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారు. జయప్రద అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. తాజాగా.. సోమవారం నాడు కోర్టులో జడ్జి ముందు లొంగిపోయారు. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకున్న జయప్రద.. తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ వంటి అనేక భాషల్లో దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించారు. తర్వాత 1994లో టీడీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు.