తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైమ్.. ఇంకొన్ని గంటల్లో జనం పోలింగ్ కేంద్రాలకు చేరతారు. అర్థరాత్రి పూట నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేరుకున్నారు. డ్యామ్ లో సగం మాదే అంటే 13 గేట్లను ఆక్రమించుకొని కంచె నిర్మించారు. తెలంగాణ పోలీసులు వచ్చినా.. డ్యామ్ ఖాళీ చేయలేదు. ఆ తర్వాత 2 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా దిగువకు వదులుకున్నారు ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు.
పదేళ్ళుగా లేని ఈ నీళ్ళ రాజకీయం.. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నవేళ.. అర్థరాత్రి టైమ్ లో ఏపీ సీఎంకు ఎందుకు ఈ విపరీత ఆలోచన వచ్చింది. తెలంగాణలో దాదాపు ప్రభుత్వం లేని టైమ్.. అధికారమంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. ఈ టైమ్ లోనే నీళ్ళ కోసం ఎందుకు పంచాయతీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ళవుతున్నా.. ఇప్పటి వరకూ ఆంధ్ర – తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి వైరం లేదు. అటూ ఇటూ జనం రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. ఆ బంధుత్వాలూ తెగిపోలేదు.. రాజకీయ నాయకులు కూడా తిరుగుతూనే ఉన్నారు. మరి ఎందుకు రాత్రికి రాత్రే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం చేపట్టారు.
Kakinada : కాకినాడ సముద్రతీరంలో బోటు లో పేలిన సిలిండర్.. సముద్రంలో దూకిన మత్స్యకారులు
పోలింగ్ రోజున కంగాలీ రాజకీయం ఇది. కేటీఆర్ – జగన్ కలసి వేసిన మాస్టర్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. సెంటిమెంట్ తో జనం భయపడిపోయి.. మళ్ళా బీఆర్ఎస్ కే ఓట్లేస్తారన్నది వీళ్ళ పిచ్చి ఆలోచన. ఇన్నేళ్లు గడిచినా ఇంకా జనం ఎమోషన్స్ తో ఆడుకోవడం మాత్రం ఆంధ్ర, తెలంగాణ పార్టీలు మానలేదు. ఆంధ్ర – తెలంగాణ ప్రజల మధ్య.. లేని వైరాన్ని సృష్టించి.. పబ్బం గడుపుకోవాలనే యావ టీఆర్ఎస్, వైసీపీకి కనిపిస్తున్నాయి. గత పదేళ్ళుగా.. అడపా దడపా ఇలాంటి వైరం పెడుతూ ఇప్పటికీ లబ్ధి పొందుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ.. ఇవన్నీ ఆ తానులో ముక్కలే.
పోలింగ్ రోజున వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే… ఆంధ్ర పోలీసులు చేసిన హంగామా నీచ రాజకీయాలను గుర్తు చేసింది. తెలంగాణ ప్రజల దృష్టిలో ఆంధ్ర వాళ్ళని చులకన చేసేటట్లుగా పోలింగ్ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి బలవంతంగా తాగు నీటి కోసం గేట్లు తెరవడం ఓ డ్రామాలాగా నడిచింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనంలో మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చాలని ప్లాన్ వేశారు. BRS కు ఓట్లు కురిపించాలన్న ప్లాన్ లో భాగంగా ఇది జరిగిందని జనానికి అర్థమైంది. అయితే ఈ సెంటిమెంట్ ను తెలంగాణ జనం పెద్దగా గుర్తించలేదు. కాకపోతే ఈ చిల్లర రాజకీయంలో చివరికి ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ తో పాటు కేటీఆర్ అభాసుపాలయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ తో పాటు ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ చర్యను తప్పుబట్టారు.
బైట్: రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి , పురంధేశ్వరి
ఏపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల మీద ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏదో పార్టీకి లబ్ది చేకూర్చాలని మేం చేయలేదు అంటూ తమ చర్యను వెనకేసుకొచ్చారు. గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనేమో. ఏపీ హక్కులు కాపాడే ప్రయత్నం చేశారట. ఆ హక్కులు.. ఎన్నికలవేళనే గుర్తుకొచ్చాయా.. సాగర్ భద్రత బాధ్యతలను కృష్ణా రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినప్పుడు ఏం చేశారు. ఇన్నాళ్ళుగా టీఎస్ పోలీసులే డ్యామ్ కాపలా కాస్తుండగా.. ఇప్పుడు అర్థరాత్రి ఏపీ పోలీసులను దించాల్సిన అవసరం ఏమొచ్చింది. నాలుగు రోజులు ఆగితే కొత్త ప్రభుత్వం ఏమైనా డ్యామ్ ని ఆక్రమించేస్తుందా.. నిజంగా ఏపీకి అన్యాయం చేస్తే.. కేంద్ర ప్రభుత్వం లేదా.. సుప్రీంకోర్టు.. ట్రైబ్యునల్స్ ఏం చేయకుండా ఉంటాయా.. ఏదేమైనా జనం భావోద్వేగాలతో ఆడుకోడానికి లీడర్లు ఎంత కంగాళీ రాజకీయం చేస్తారో అన్నది తెలియడానికి సాగర్ డ్యాం వదంతం చరిత్రలో నిలిచిపోతుంది.