KTR : కేటీఆర్ ఎంపీగా వెళితే.. రాష్ట్రంలో ఎలా ?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో షాకైన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దెబ్బ ఎక్కడ పడిందో మెల్లిగా క్లారిటీ వస్తున్నందున.. ఈసారి .. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష మొదలు పెట్టింది అధినాయకత్వం. పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో ఒక రకంగా అభ్యర్థుల ఖరారు కసరత్తు కూడా జరుగుతోందట.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో షాకైన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. దెబ్బ ఎక్కడ పడిందో మెల్లిగా క్లారిటీ వస్తున్నందున.. ఈసారి .. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష మొదలు పెట్టింది అధినాయకత్వం. పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో ఒక రకంగా అభ్యర్థుల ఖరారు కసరత్తు కూడా జరుగుతోందట. సార్వత్రిక ఎన్నికలు హోరా హోరీగా జరుగుతాయన్న అంచనాలతో ఈసారి అభ్యర్థుల విషయంలో ఆచి తూచి అడుగులేయాలని అనుకుంటోంది గులాబీ అధినాయకత్వం. అందుకే సీనియర్స్‌ని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న చర్చ అంతర్గతంగా జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు.

ఈ క్రమంలోనే.. మల్కాజ్‌గిరి నుంచి కేటీఆర్‌ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన తెర మీదికి వచ్చినట్టు తెలిసింది. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌ అయింది. పార్టీ అవసరాలు, నిర్ణయానుసారం ఒక వేళ కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తయితే.. గెలిచి ఢిల్లీ వెళితే.. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఏంటన్న చర్చ పార్టీ వర్గాల్లో వివిధ కోణాల్లో జరుగుతోంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల మీదే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. పైగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఎప్పటికప్పుడు వ్యూహ, ప్రతివ్యూహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనీ.. అలాంటప్పుడు ఆయన లోక్‌సభ పేరుతో ఢిల్లీకి వెళితే ఇక్కడి వ్యవహారాల బాధ్యతల్ని ఎవరికి అప్పజెపుతారన్న ప్రశ్నలకు సమాధానం వెదుకుతున్నాయట బీఆర్‌ఎస్‌ వర్గాలు.

ఆ క్రమంలోనే హరీష్‌రావు, కవిత పేర్లను ప్రస్తావిస్తున్నాయట పార్టీ వర్గాలు. ప్రస్తుతం అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. కానీ.. గత సెషన్‌లో కేటీఆర్‌, హరీష్‌రావే కీలకంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో నిజంగానే కేటీఆర్‌ లోక్‌సభకు వెళితే.. ఇక రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల్ని హరీష్‌, కవితలకు ఇస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. అదే సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోక్‌సభకు పోటీ చేసే అవకాశం లేదన్న మరో వాదన కూడా ఉంది. జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమేననీ… పరిస్థితి అంతదాకా వచ్చినప్పుడు ఆలోచించవచ్చంటున్నాయి బీఆర్‌ఎస్‌ సన్నిహిత వర్గాలు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. చివరికి ఇవి ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతాయోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయవర్గాలు.