Lioness ‘Sita’: బెంగాల్ సఫారీలో సీత.. పక్కనే అక్బర్.. సింహాలపై కోర్టుకెక్కిన వీహెచ్‌పీ

త్రిపురలోని సెపహజిల జూ పార్క్ నుంచి ఈ నెల 13న సింహాలను సిలిగురి సఫారిపార్కులోకి తరలించారు. ఇక్కడ అక్బర్ అనే మగ సింహాన్ని, సీత అనే ఆడ సింహాన్ని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచాలని అటవీశాఖ అధికారులు నిర్ణ‍యం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 08:03 PM IST

Lioness ‘Sita’: ఏ సఫారీలోనైనా రెండు సింహాలు.. అందులో ఆడ, మగ సింహాలు ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉండటం సహజం. ఇది సాధారణమే. కానీ, ఈ విషయంలోనే హిందూ ధర్మ ప్రచారం సంస్థ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభ్యంతరం చెబుతోంది. దీనికి కారణం ఉంది. ఇందులో ఆడ సింహం పేరు సీత. మగ సింహం పేరు అక్బర్. ఈ రెండు పేర్లూ.. రెండు వేర్వేరు మతాలకు సంబంధించినవి.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్.. రూ.2900 కోట్ల జ‌రిమానా విధించిన కోర్టు

సీత హిందూ మతానికి సంబంధించిన పేరుకాగా.. అక్బర్.. మొఘల్ చక్రవర్తికి సంబంధించిన ఇస్లాం పేరు. త్రిపురలోని సెపహజిల జూ పార్క్ నుంచి ఈ నెల 13న సింహాలను సిలిగురి సఫారిపార్కులోకి తరలించారు. ఇక్కడ అక్బర్ అనే మగ సింహాన్ని, సీత అనే ఆడ సింహాన్ని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచాలని అటవీశాఖ అధికారులు నిర్ణ‍యం తీసుకున్నారు. ఈ సింహాలను ఇక్కడికి తరలించే ముందు వాటి పేర్లు మార్చలేదు. సీత అనే ఆడసింహాన్ని, అక్బర్‌ అనే మగ సింహాన్ని ఒకేచోట ఉంచడంపై వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంలో బెంగాల్ అటవీశాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వీహెచ్‌పీ.. కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

రెండు సింహాలను ఒకే చోట ఉంచడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొంది. ఆడ సింహం పేరు మార్చాలని పిటిషన్‌లో కోరింది. బెంగాల్ అటవీశాఖను, సఫారీ డైరెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చింది. ఈ నెల 20, మంగళవారం ఈ కేసు విచారణ జరగనుంది. మరి, దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.