Pawan Kalyan, Balayya : పవన్ కల్యాణ్ లాగే నేనూ ..! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీతో కలిసి పని చేస్తానని పవన్ ప్రకటించినప్పటి నుంచి బాలయ్య బాబు తెగ సంతోషంగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ ను హిందూపురం మీటింగ్ లో చూపించారు. పవన్ కల్యాణ్ కీ తనకూ మధ్య సారూప్యత ఉందన్నారు. నేను, పవన్ ముక్కుసూటిగా మాట్లాడతామని చెప్పారు.

జనసేన (Janasena ) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పోల్చుకున్నారు నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు.

టీడీపీతో కలిసి పని చేస్తానని పవన్ ప్రకటించినప్పటి నుంచి బాలయ్య బాబు తెగ సంతోషంగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ ను హిందూపురం మీటింగ్ లో చూపించారు. పవన్ కల్యాణ్ కీ తనకూ మధ్య సారూప్యత ఉందన్నారు. నేను, పవన్ ముక్కుసూటిగా మాట్లాడతామని చెప్పారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నా అన్నారు బాలయ్య. టీడీపీ – జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఏపీలో అన్నీ ఇన్నీ అని కాదు గానీ.. మొత్తంగా టీడీపీ – జనసేన గెలుస్తుందని అంటున్నారు బాలక్రిష్ణ.

Telangana, IT Rides : తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్.. భాస్కర్ రావు అనుచరుల ఇంట్లో ఐటీ తనిఖీలు

ఏపీలో అభివృద్ధి శూన్యం.. రాష్ట్రంలో పరిపాలన అంతా ఇష్టారాజ్యంగా మారింది.. నేరస్తులు, హంతకుల చేతిలో ఉందంటున్నారు బాలక్రిష్ణ. పరిపాలన చేతకాక.. మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. వైఎస్ జగన్ పాలనతో ఈ పదేళ్ళలో అభివృద్ధి వెనక్కి పోయింది. రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్ళే కరువయ్యారని అంటున్నారు బాలయ్య. ఒక సిమెంట్ రోడ్డు లేదు.. ఒక గొయ్యికి తట్టెడు మట్టెడు కూడా పోయలేదంటూ.. జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నా.. హిందూపురంలో మాత్రం అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

జనసేన, టీడీపీ.. ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరాక బాలయ్య.. పవన్ కల్యాణ్ తో కలసి చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ కూడా అయ్యాడు. ప్రెస్ మీట్ లో కూడా కలుస్తున్నారు. తెలంగాణలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బాలయ్య ప్రచారం చేయాలని డిమాండ్స్ కూడా వస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నా.. ఇప్పటికీ పవన్ కల్యాణ్ క్యాంపెయిన్ పై ఓ క్లారిటీ రాలేదు. అలాంటిది బాలయ్య వస్తారా.. జనసేన తరపున ప్రచారం చేస్తారా అనేది డౌట్ గా ఉంది. ఒకవేళ వస్తే.. చంద్రబాబు అరెస్ట్, ఐటీ ఉద్యోగుల ధర్నా పై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.