జనవరి 5 2022 లో పంజాబ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బటిండా విమానాశ్రయంలో దిగి.. అక్కడి హెలికాప్టర్ లో ఫిరోజ్ పూర్ వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించగా.. ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఒక్కసారిగా ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడం ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫైఓవర్ పై చిక్కుకుపోయిన ఘటనలో తాజాగా మరో ఆరుగురు అధికారలుపై వేటు వేసింది.
Modi Telangana Tour : తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటన..
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీస్ అధికారులపై ఆ రాష్ట్ర హోంశాఖ ఆదివారం వేటు వేసింది. తాజాగా సస్పెన్షన్‌కు గురైన వారిలో ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులు పార్శన్ సింగ్, జగదీశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ, ఒక ఏఎస్‌ఐ ఉన్నారు. వీరితో సస్పెండ్ వేటు పడిన పోలీసు అధికారుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే ప్రస్తుతం బఠిండా జిల్లా ఎస్పీగా ఉన్న(అప్పటి ఫిరోజ్‌పూర్ ఎస్పీ) గుర్బిందర్ సింగ్‌ను శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ డీజీపీ నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకొన్నది.
జనవరి 5 2022 లో పంజాబ్ లోని కార్యాక్రమానికి, ర్యాలీకి హాజరుకాకుండానే పంజాబ్ నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. 2022 జనవరిలో కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యంపై పలువురు రాష్ట్ర అధికారులను సుప్రీంకోర్టు నియామక కమిటీ తప్పుపట్టింది. 22 నెలల అనంతరం దీనిపై పంజాబ్ సర్కార్ చర్య తీసుకుంటూ బటిండా ఎస్‌పీని సస్పెండ్ చేసింది.