Lakshadweep: ఇటీవలి కాలంలో లక్షద్వీప్ గురించి దేశమంతా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దేశానికి చెందిన సుందరమైన దీవుల సముదాయం లక్షద్వీప్. పర్యాటకానికి ఎంతో అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఇక్కడ పర్యటించడంతో దీనిపేరు మారుమోగిపోయింది. మరోవైపు మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా, లక్షద్వీప్ దీవుల్ని తెరమీదకు తెచ్చారని అంతా భావించారు. అయితే.. మోదీ లక్ష్యం పర్యాటకం ఒక్కటే కాదు. అంతకుమించి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, మాల్దీవ్స్‌కు గుణపాఠం చెప్పడంతోపాటు మోదీ వేసిన ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
YS. Vijayamma’s : విజయమ్మ సపోర్ట్ షర్మిలకేనా..?
లక్షద్వీప్ అనేక దీవుల సముదాయం. ఇక్కడ నైన్ డిగ్రీ ఛానల్ అనే ఒక సముద్ర మార్గం ఉంటుంది. ఇది చాలా సున్నితమైన సముద్ర మార్గం. ఈ ప్రాంతంలో చిన్న అలజడి రేగినా అది ఆసియా ప్రాంతంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. నైన్ డిగ్రీ ఛానల్ సముద్ర మార్గం హిందూ మహాసముద్రం పరిధిలోని లక్షద్వీప్‌లోని కాల్పెనీ, మినికోయ్ దీవులను వేరు చేస్తుంది. ఇది అత్యంత కీలకమైన మార్గం కాబట్టే మోదీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఏడాదికాలంగా ఇక్కడ పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల్లో ఇక్కడ భారీ విమానాశ్రయాన్ని కూడా నిర్మించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. దీంతో ఈ ద్వీపం మీద భారత్ గుత్తాధిపత్యం పూర్తిగా ఉంటుంది. ఇదే తరుణంలో నైన్ డిగ్రీ ఛానల్ ఇక్కడే కేంద్రీకృతం అయి ఉంది కాబట్టి.. ఇండియాకు అడ్డుగా ఉండే చైనా, ఇతర దేశాలను సవాల్ చేయొచ్చని మోదీ ఆలోచన.
ఈ సముద్ర మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా అత్యంత కీలకమైంది. నిమిషానికి 11 షిప్పులు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయంటే, ఈ మార్గంలో రవాణా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా నుంచి ఇండియా, దక్షిణాసియా, చైనా, అగ్నేయాసియాలకు నైన్ డిగ్రీ ఛానల్ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్లడం.. మన దేశానికి సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కలిగిస్తోంది. ఇక్కడ విస్తరించి ఉన్న మిని కోయ్ దీవులను రక్షణ స్థావరంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడి నిర్మాణాలను భారత్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, రక్షణ పరంగా వినియోగిస్తే సముద్ర జలాలపై తిరుగులేని ఆధిపత్యం మన దేశానికి దొరుకుతుంది. భవిష్యత్తులో చైనా దేశంతో ఏవైనా ఘర్షణలు ఏర్పడితే.. ఈ మార్గాన్ని అప్పుడు భారత్ మూసివేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల డ్రాగన్ కంట్రీ తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మార్గం మీదుగానే చైనా దేశానికి ఇతర దేశాలు కీలకమైన ముడి ఇనుము, జనపనార, పెట్రో ఉత్పత్తులు, ఔషధాలు తయారు చేసేందుకు వాడే ముడి సరుకు రవాణా అవుతుంటాయి.
Chiru 156 : విశ్వంభరన్ని మేకర్స్ సీక్రెట్‌గా ఉంచుతున్నారా..
చైనాకు కీలకంగా నిలుస్తున్న రంగాలకు చెందిన ముడిసరుకు ఈ మార్గం గుండానే వెళ్తుంది. చైనా సాధిస్తున్న జీడీపీలో సుమారు 60 శాతం ఈ రంగాల ద్వారానే ఉంటుంది. వీటిని భారత్ నియంత్రించగలిగితే.. చైనాకు అపార నష్టం కలుగుతుంది. అందువల్లే ప్రధాని మోదీ లక్షద్వీప్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మించడం ద్వారా పర్యాటకాన్ని ఆకర్షించడంతోపాటు రక్షణ పరంగా కూడా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. నిజానికి మన దేశం లక్షద్వీప్ మీద దృష్టి సారించడం మొదలుపెట్టిందో.. అప్పుడే చైనా మాల్దీవులకు దగ్గరయింది. అయితే, ఈ విషయాన్ని ముందే గుర్తించిన మోదీ.. తను అనుకున్న లక్ష్యంవైపు అడుగులు వేయడం ప్రారంభించారు. ఇక లక్షద్వీప్‌పై మోదీ ప్లాన్.. మన దేశానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.