Prajwal Revanna arrested : బెంగుళూరులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. CID కార్యలయంలో విచారణ..

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుండి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య విచారణ నిమిత్తం CID కార్యాలయానికి తరలించారు. ఏప్రిల్లో దేశం విడిచి వెళ్ళిపోయినట్టు, మూడు కేసులు నమోదయినట్టు తెలిసిందే.

కాగా జేడీఎస్ (JDS) ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎన్డీయే కూటమి (NDA Alliance) తరఫున హాసన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇటీవలే పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి (Sexual Harassment) చేసినట్లు.. కొన్ని వీడియోలు షోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. గత నెల ఏప్రిల్‌లో ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయారు. దీంతో ప్రజ్వల్ కు ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్‌ నోటీసులు, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీఅయ్యాయి. కాగా ఇప్పటి వరకు ప్రజ్వల్ రేవణ్ణపై మూడు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాట సీఎం సిద్ధరామయ్య డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాయడంతో విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది.