Rahul Assets :  రాహుల్ గాంధీకి ఆస్తులు ఎన్నో తెలుసా ? సొంత కారు, ఇల్లూ లేవు !

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆయన బుధవారం సోదరి ప్రియాంక గాంధీతో కలసి వెళ్ళి నామినేషన్ ఫైల్ చేశారు.  తనకు రూ.20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు.  ఇందులో రూ.9.24 చరాస్తులు, 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. 

  • Written By:
  • Updated On - April 4, 2024 / 07:01 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆయన బుధవారం సోదరి ప్రియాంక గాంధీతో కలసి వెళ్ళి నామినేషన్ ఫైల్ చేశారు.  తనకు రూ.20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు.  ఇందులో రూ.9.24 చరాస్తులు, 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు.

చరాస్తుల్లో బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టు రాహుల్ గాంధీ తన అఫిడవిట్ లో తెలిపారు.  రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి, రూ.61.52 లక్షల విలువైన నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్ బీమా పాలసీలు, రూ.15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు, రూ.55 వేల నగదు ఉన్నట్టు రాహుల్ అఫిడవిట్ లో తెలిపారు.

రాహుల్ గాంధీకి 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా… వాటిల్లో సొంత కారు గానీ, ఉండటానికి ఇల్లు గానీ లేదు.  స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మొహరౌలి ఏరియాలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ప్రియాంక గాంధీకి కూడా వాటా ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు రాహుల్ గాంధీ.  ఇది తనకు వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. ఇది కాకుండా గురుగ్రామ్ లో రూ.9 కోట్ల విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. అలాగే రూ.49.7 లక్షల లోన్లు కూడా తనకు ఉన్నట్టు అఫిడవిట్ లో చూపించారు రాహుల్ గాంధీ.  బీజేపీ లీడర్లు వేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో క్రిమినల్ కేసులు లాంటి వివరాలు కూడా ఇచ్చారు. అయితే వాయనాడ్ లో రాహుల్ కి ఆపోజిట్ గా సీపీఐ తరపున అన్నీ రాజా పోటీచేస్తున్నారు.  ఆమెకు రూ.72 లక్షల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు.
https://www.youtube.com/watch?v=Ir_4bt9-cus