MP Senthil Kumar: గోమూత్ర రాష్ట్రాలంటూ వ్యాఖ్య.. క్షమాపణలు చెప్పిన ఎంపీ..

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుంది. అంటే మేం వాటిని గోమూత్ర రాష్ట్రాలని అంటాం. అలాంటి చోటే బీజేపీ గెలుస్తుంది. అదే దక్షిణ భారత దేశంలో గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఫలితాల్ని మనం చూస్తూనే ఉన్నాం

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 08:24 PM IST

MP Senthil Kumar: బీజేపీ పాలిత హిందీ రాష్ట్రాల్ని గోమూత్ర రాష్ట్రాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మంత్రి క్షమాపణలు చెప్పారు. తాజా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మంగళవారం డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్.. పార్లమెంట్‌లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుంది. అంటే మేం వాటిని గోమూత్ర రాష్ట్రాలని అంటాం. అలాంటి చోటే బీజేపీ గెలుస్తుంది. అదే దక్షిణ భారత దేశంలో గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఫలితాల్ని మనం చూస్తూనే ఉన్నాం” అని వ్యాఖ్యానించాడు.

SRINIVAS GOUD: ఇదేం దొంగపని.. ఫర్నీచర్ ఎత్తుకుపోతూ దొరికిపోయిన శ్రీనివాస్ గౌడ్..

ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందీ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సెంథిల్ కుమార్ క్షమాపణ చెప్పాలని తప్పుబట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంథిల్ వ్యాఖ్యల్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో సెంథిల్ క్షమాపణ చెప్పారు. “నేను ఆ మాటల్ని అనుకోకుండా అన్నాను. నా మాటలు సభలోని సభ్యులు, ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తే.. వాటిని నేను ఉపసంహరించుకుంటున్నాను.

ఆ పదాలను తొలగించాలని సభను కోరుతున్నాను. నా మాటలకు చింతిస్తున్నాను” అని ప్రకటించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. కాగా.. తాజాగా వెల్లడైన ఫలితాల్లో దక్షిణ భారత దేశానికి చెందిన తెలంగాణలో బీజేపీ పరాజయం పాలైంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలోనే డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.