కలకత్తా డాక్టర్‌ కేసులో సంచలన నిజాలు సంజయ్‌ రాయ్‌ అసలు మనిషేనా!

కలకత్తా డాక్టర్‌ కేసు విచారణలో ఒళ్లు గగురుపొడిచే నిజాలు బయటికి వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 04:57 PM IST

కలకత్తా డాక్టర్‌ కేసు విచారణలో ఒళ్లు గగురుపొడిచే నిజాలు బయటికి వస్తున్నాయి. సీబీఐ అదుపులో ఉన్న నిందితులు సంజయ్‌ రాయ్‌ చెప్తున్న విషయాలు వింటే అసలు వీడు మనిషేనా అనిపిస్తోంది. డాక్టర్‌ను అత్యంత దారుణంగా చంపేసిన ఈ నీచుడు.. హత్యకు ముందు ఏం చేశాడో విని అధికారులే విస్తు పోయారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆర్జీకార్‌ హాస్పిటల్‌కు వచ్చిన సంజయ్‌ రాయ్‌.. అంతకంటే ముందు స్నేహితులతో కలిసి ఫుల్‌ పార్టీ చేసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా కలకత్తాలోని రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లాడు. ఆ ఏరియా మొత్తం తిరిగాడు. అక్కడ ఎవరూ సంజయ్‌కి నచ్చలేదు. అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్‌కు బయల్దేరాడు. హాస్పిటల్‌కు వచ్చాక కూడా అక్కడ ఓ అమ్మాయిని వేధించినట్టు సిగ్గులేకుండా అధికారులకు చెప్పాడు సంజయ్‌. మద్యం మత్తులోనే తన ప్రియురాలికి ఫోన్‌ చేసి న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఆ కాల్‌ కట్‌ చేసిన తరువాత నేరుగా హాస్పిటల్‌లోకి ఎంటర్‌ అయ్యాడు సంజయ్‌. హాస్పిటల్‌లోని అన్ని రూమ్స్‌ వెతుకుతూ నేరుగా మూడో ఫ్లోర్‌కు వెళ్లాడు. ఏ రూంలో ఎవరు ఉన్నారు అని చూస్తూ ఓ మృగంలా ఆ ఫ్లోర్‌ అంతా తిరిగాడు. చివరగా కాన్ఫరెన్స్‌ హాల్‌కు వెళ్లాడు. అక్కడ అభయ నిద్రపోతూ కనిపించింది. వెంటనే రూంలోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సౌండ్‌ ప్రూఫ్‌ రూం కావడంతో అభయ చేసిన ఆర్థనాదాలు ఎవరికీ వినిపించలేదు. దాదాపు 30 నిమిషాలు అభయను నరకయాతనకు గురి చేస్తూ అత్యాచారం చేసి చంపేశాడు. పోస్ట్‌మార్టంలో అభయ ఒంటిమీద ఉన్న గాయాలు చూసి డాక్టర్లే షాకయ్యారు. చనిపోయేముందు భరించలేనంత బాధతో కొట్టమిట్టాడుతూ అభయ చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. సీబీఐ మొదట ప్రశ్నించినప్పుడు తాను నిర్దోషినని తనకు ఏం తెలియదని చెప్పాడు సంజయ్‌. కానీ క్రైమ్‌ సీన్.. సంజయే నిందితుడని క్లియర్‌గా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హత్యకు ముందు తాను చేసిన ఈ బాగోతం మొత్తాన్ని సీబీఐ అధికారులకు వివరించాడు సంజయ్‌. సంజయ్‌తో పాటు మరో ఐదుగురు అనుమానితులను కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో అక్యూస్డ్‌ నెంబర్‌ 2గా ఉన్న మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ నుంచి కూడా నిజాలు రాబడుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన సమాచారం మొత్తం నార్మల్‌గా తీసకున్నదే. కోర్ట్‌ నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీళ్లను కూడా లై డిటెక్టర్‌తో టెస్ట్‌ చేయబోతున్నారు. ఈ క్వశ్చనింగ్‌ పూర్తైన తరువాత కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి.