Pawan Kalyan : తెలంగాణలో పంచ్ లు ఉండవా ..? పవన్ ప్రచారం ఇలాగైతే కష్టమేనా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ఎట్టకేలకు అడుగుపెట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ – జనసేన అభ్యర్థుల తరపున వరంగల్ నుంచి క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ అసలు మాట్లాడుతోంది పవన్ కల్యాణేనా అన్న అనుమానం ఆయన అభిమానుల్లో కనిపించింది. మొదటిరోజు మీటింగ్ లో మోడీని పొగడటానికి.. తెలంగాణ పౌరుషమే ఆంధ్రలో పోరాడటానికి పనికొచ్చింది అని చెప్పుకోవడమే గానీ పెద్దగా పవర్ పంచ్ లు రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ఎట్టకేలకు అడుగుపెట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. బీజేపీ – జనసేన అభ్యర్థుల తరపున వరంగల్ నుంచి క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ అసలు మాట్లాడుతోంది పవన్ కల్యాణేనా అన్న అనుమానం ఆయన అభిమానుల్లో కనిపించింది. మొదటిరోజు మీటింగ్ లో మోడీని పొగడటానికి.. తెలంగాణ పౌరుషమే ఆంధ్రలో పోరాడటానికి పనికొచ్చింది అని చెప్పుకోవడమే గానీ పెద్దగా పవర్ పంచ్ లు రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

BRS, Theinmar Mallanna : బీఆర్‌ఎస్‌లో చేరిన తీన్మార్‌ మల్లన్న.. వైరల్‌ ఫొటోల వెనక అసలు నిజం..

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టూర్ ఉందంటే చాలు.. యూత్ తో పాటు అన్ని వర్గాల వారు ఆయన స్పీచ్ వినడానికి వస్తుంటారు. వారాహి యాత్రలో పవన్ నుంచి పేలే పంచుల కోసమే జనం భారీగా గుమికూడతారు. గతంలోనూ ఇలాగే జనం వచ్చినా.. ఓట్లు, సీట్లు రాలేదు పవన్ పార్టీకి. కానీ ఈసారి టీడీపీతో అలయెన్స్ అవడం, పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచులు, సేవా కార్యక్రమాలు.. ఇవన్నీ కలిసొచ్చి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు సీట్లు వస్తాయనే అందరూ అనుకుంటున్నారు. ఇక తెలంగాణ సంగతి చూస్తే.. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు పవన్. ప్రచారానికి ఇంకా 5 రోజులే ఉండటంతో.. వరంగల్ సభ నుంచి ప్రచారం మొదలుపెట్టారు జనసేనాని. బీజేపీ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేసిన పవన్.. పంచులు లేకుండానే ముగించారు. గతంలో వైఎస్సార్ ని పంచులూడకొడతానని ఆవేశంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గానీ, సీఎం కేసీఆర్ ను గానీ పల్లెత్తు మాట అనకుండా కూల్ గా ప్రచారం చేస్తున్నారు పవన్..

ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం అయిందనీ.. తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాటం చేస్తున్నానని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇక్కడో ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. 4కోట్ల మంది సకల జనుల సమ్మె, 12 వందల మంది యువకుల బలిదానాలతో ఉద్యమం నుంచి పుట్టిన పార్టీనే అధికారంలో ఉండాలనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నా అన్నారు. అంటే పరోక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి.. బీఆర్ఎస్ పై విమర్శలు చేయలేదన్న ధోరణిలో మాట్లాడారు. BRS ప్రభుత్వం అవినీతిమయం అయిందన్న పవన్.. మరి ఎందుకు ఫైర్ అవ్వలేదు. కేసీఆర్ కుటుంబ వారసత్వ రాజకీయాలు, కాళేశ్వరంలో అవినీతిపై బీజేపీ నేతలు తరుచుగా మాట్లాడుతున్నారు. మరి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి వచ్చిన పవన్ ఆ స్థాయిలో ఎందుకు విమర్శలు చేయలేదు… తమ కూటమి అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ఫ్యామిలీపై ఎంక్వైరీ చేయిస్తామని కూడా ఎందుకు అనలేదు.. అన్న చర్చ బీజేపీలో నడుస్తోంది.

రాబోయే కొన్ని రోజుల్లో అయినా కనీసం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు చేస్తారా.. ఆంధ్రప్రదేశ్ లో లాగా తెలంగాణలోనూ పంచ్ లు వినగలుగుతామా అని బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సహజ పంచ్ లు లేకుండా చప్పగా సాగితే ఈ ప్రచారం పెద్దగా తమకు ఉపయోగపడేది ఏమీ ఉండదని బీజేపీ అభ్యర్థులు అనుకుంటున్నారు.