DOSA ORDERS: కరకరలాడే దోశ.. అరే ఏంట్రా ఇది ! నిమిషానికి 122 దోశలా..?

మన దేశంలో ఇప్పుడంతా దోశను ఎక్కువగా తింటున్నారని స్విగ్గీ తన రిపోర్టులో తెలిపింది. ఫిబ్రవరి 25న వరల్డ్ దోశ డే. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి మొన్న ఫిబ్రవరి 25 దాకా తమ యాప్‌లో బుక్ అయిన దోశల ఆర్డర్స్ లెక్కలు బయటకు తీసింది.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 03:54 PM IST

DOSA ORDERS: ఒకప్పుడు దక్షిణాది వాళ్ళు పొద్దున టిఫిన్‌గా ఇడ్లీని సాంబార్‌తో లేదంటే పల్నీ చట్నీ, అల్లం పచ్చడితో అలా.. అలా.. నంజుకొని తినేవాళ్ళు. ఉత్తరాది వాళ్ళకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్పెషాలిటీస్ ఉన్నాయి. అయితే, ఇప్పుడు మన భారతీయులంతా దోశల మీద మనసు పారేసుకున్నారట. ఒకటా.. రెండా.. దోశల్లోనూ బోల్డన్ని వెరైటీలు వచ్చేశాయి. అందుకే బ్రేక్ ఫాస్టే కాదు.. డిన్నర్ కూడా దోశతోనే కానిచ్చేస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. దోశల గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టింది.

Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. ఐదుగురికి గాయాలు..

మన దేశంలో ఇప్పుడంతా దోశను ఎక్కువగా తింటున్నారని స్విగ్గీ తన రిపోర్టులో తెలిపింది. ఫిబ్రవరి 25న వరల్డ్ దోశ డే. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి మొన్న ఫిబ్రవరి 25 దాకా తమ యాప్‌లో బుక్ అయిన దోశల ఆర్డర్స్ లెక్కలు బయటకు తీసింది. ఇందులో దేశవ్యాప్తంగా నిమిషానికి 122 దోశలను ఆర్డర్ చేశారట జనం. మొత్తం ఏడాదిలో రెండు కోట్ల 90 లక్షల దోశలను మనోళ్ళు తినేశారు. ఇవి ఆన్‌లైన్ ఆర్డర్ లెక్కలు మాత్రమే. జనరల్‌గా మార్నింగ్ టిఫిన్‌గానే దోశను తింటారు చాలామంది. కానీ కొందరైతే రాత్రిపూట అన్నం, చపాతీలు లాంటివి కూడా మానేసి.. ఎంచక్కా దోశలు ఆర్డర్ చేసుకొని లాగించేస్తున్నారట. దోశల ఆర్డర్స్ బెంగళూరు నుంచే ఎక్కువగా వచ్చాయని స్విగ్గీ చెబుతోంది. ఆ తర్వాత ప్లేసులో.. హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.

ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దోశకు ఫుల్ డిమాండ్ ఉంది. దక్షిణాది తర్వాత ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోనూ దోశ ఆర్డర్స్ భారీగా వచ్చాయంటోంది స్విగ్గీ. దోశను టేస్ట్ చేయాలే గానీ.. ఈమధ్య చాలా వెరైటీలు వచ్చేశాయి. కానీ అందరికీ నచ్చింది.. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది మాత్రం.. మసాలా దోశనే. సాదా దోశ.. సెట్ దోశ.. ఉల్లి దోశ, బట్టర్ మసాలా దోశ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయట. దక్షిణాది, ఉత్తరాది అని లేకుండా బ్రేక్ ఫాస్ట్, డిన్నర్‌లో కూడా కరకరలాడే దోశలను తినేస్తున్నారు మన ఇండియన్స్.