ఇండియన్ ఆర్మీ పవర్ ఇది అని చెప్పడానికి మాటలు సరిపోవ్.. భాష సరిపోదు.. ప్రతీ గుండెలో, శరీరం ప్రతీ కణంలో భారత్ మాతా కీ జై నినాదాలతో.. సరిహద్దుల్లో సింహాల్లా కనిపిస్తుంటారు మన సైనికులు. కుట్రలు చేసిన చైనా అయినా.. కుతంత్రాలు పన్న పాక్ అయినా.. భారత్ ఆర్మీ పవర్‌కు మోకరిల్లిన ఘటనలు ఎన్నో ! ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది. అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కార్గిల్ పర్వత ప్రాంతాల్లో.. రాత్రివేళ భారీ రవాణా విమానాన్ని ల్యాండింగ్ చేసింది. ఇక్కడి చిన్న రన్ వేపై C 130J వెహికల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసింది.
విమానం నైట్ ల్యాండింగ్ వీడియోను భారత వాయుసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చుట్టూ చీకటి.. చీకటిని మరింత మందం చేసిన పొగమంచు.. ఆ పొగ మంచు మధ్యలో వెలుతురు.. ఆకాశంలో భీకరమైన సౌండ్లు.. పాక్, చైనాగాళ్లు దీన్ని విని ఉంటే వణికిపోయి ఉండేవారు నిజంగా ! వెహికల్ నైట్ ల్యాడింగ్ వీడియో చూసి ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇవి. లద్దాఖ్‌లోని కార్గిల్‌లో విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది. ఐతే భారతదేశ భద్రతకు సంబంధించి ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. కార్గిల్ హిమాలయాల్లో 8వేల అడుగుల ఎత్తులో వుంది. అలాంటిది ఏకంగా C 130J సూపర్ హెర్య్కులస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది. ల్యాండింగ్ సమయంలో, గరుడ్ కమాండోలతో టెరైన్ మాస్కింగ్ కూడా జరిగింది. రాత్రిపూట ఈ ల్యాండింగ్ చేయడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. దాని స్వంత సామర్థ్యాలను అంచనా వేసింది. మన పవర్ ఏంటో శత్రువులకు తెలిసేలా చేసింది. నిజానికి ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా కార్యకలాపాలను పసిగట్టిన భారత వైమానిక దళం.. రాత్రిపూట కూడా సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ నైట్ ల్యాండింగ్ నిర్వహించింది.