Modi’s guarantees : ఇవే మోదీ గ్యారంటీలు..! బీజేపీ మేనిఫెస్టోలో హైలెట్స్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టో లోని అంశాలను బయటపెట్టాయి. ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ లీడర్లు జనంలోకి వెళ్తున్నారు. పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు వెయ్యి, ఐదొందల రూపాయలు ఎక్కువ ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టో లోని అంశాలను బయటపెట్టాయి. ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ లీడర్లు జనంలోకి వెళ్తున్నారు. పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు వెయ్యి, ఐదొందల రూపాయలు ఎక్కువ ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది. బీజేపీ మాత్రం ఇప్పటిదాకా తాము ఇచ్చే తాయిలాలు ఏంటో బయటపెట్టలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ శనివారం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏయే అంశాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

REVANTH REDDY: దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి: రేవంత్ రెడ్డి

తాము అధికారంలోకి వస్తే పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో మోడీ గ్యారంటీలను అందిస్తామంటోంది బీజేపీ. సహజంగా భారీ ఉచిత పథకాలకు దూరంగా ఉండే ఆ పార్టీకి.. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీబీస్ ప్రకటించక తప్పని పరిస్థితి. బీజేపీ మేనిఫెస్టోలో అందరికీ ఉచిత వైద్యం, ప్రతి వ్యక్తికీ జీవిత బీమా, ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల వరకూ ఉచిత వైద్యం ప్రకటిస్తోంది. ఇదికాకుండా.. యూత్ ని టార్గెట్ చేస్తోంది బీజేపీ. UPSC మాదిరిగా TSPSC పరీక్షల జాబ్ క్యాలండర్ ఇస్తామంటోంది. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తామంటోంది. ప్రతి నెలా మొదటి వారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామని కూడా బీజేపీ చెబుతోంది. అలాగే మధ్యతరగతి జనం కోరుకుంటున్న విద్యాసంస్థల ఫీజుల నియంత్రణను కూడా తమ మేనిఫెస్టోలో పెట్టనుంది కమలం పార్టీ. ఇవి కాకుండా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, పెళ్ళయిన ప్రతి మహిళకు ఏడాదికి 12వేలు, పేదలకు ఇళ్ళు, ఉచిత విద్యుత్ పథకం, మహిళా సంఘాలు, రైతులకు వడ్డీ లేని రుణాలు, బీసీ ప్లాన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు లాంటి హామీలు బీజేపీ మేనిఫెస్టోలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

Minister Mallaredd : మంత్రి మల్లారెడ్డి ఆస్తుల విలువ తెలుసా..?

ఇవి కాకుండా ముస్లిమ్స్ కి హజ్ యాత్రకు లాగే.. అయోధ్య తో పాటు ఇతర ఆధ్యాత్మిక టూరిజంలో హిందువులకు ప్రయాణ సబ్సిడీలు ఇచ్చే ఛాన్సుంది. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20 వేల రూపాయలు, రాష్ట్ర మంతటా జన ఔషధీ కేంద్రాలు, ఐఐటీ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు లాంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టో ఎజెండాలో ఉన్నాయి.

P Chidambaram: కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది: కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం

బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ సీనియర్ లీడర్లే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్ గా ఉన్న వివేక్ వెంకటస్వామి బీజేపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఉన్నప్పుడు.. కేవలం గత ఎన్నికల నాటి మేనిఫెస్టో కాపీలను సభ్యులందరికీ షేర్ చేశారు. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో మేనిఫెస్టో కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. వివేక్ రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరాక మేనిఫెస్టో మీటింగే జరగలేదు. అయితే బీజేపీ సీనియర్ నేతలంతా కలసి డ్రాఫ్ట్ ని ఫైనలైజ్ చేసి బీజేపీ అధిష్టానానికి పంపారు. దాన్ని కేంద్ర నాయకత్వం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే ఈ శనివారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిలీజ్ చేయనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీల స్థాయిలో మాత్రం బీజేపీ మేనిఫెస్టోలో వరాలు ప్రకటించే అవకాశాలు లేవు.