Lok Sabha Elections : నేడు 12 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్..! ఓటు వేసిన ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. నేడు సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. నేడు సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మూడో విడతలో భాగంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా 11 రాష్ట్రాలు, ఈ దశలో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో ఈరోజు 17.24 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు.

కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, ఎస్.పి.సింగ్ బఘెల్, ప్రహ్లాద్ జోషి, డింపుల్ యాదవ్, సుప్రీయా సూలే, సునేత్ర పవార్ వంటి ప్రముఖులు కూడా తృతీయ విడత బరిలో నిలిచారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్సభ స్థానాలకుగాను 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ దశలో అసోం- 4 , బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది.

SSM