గుడిని కాపాడేందుకు దొంగలతో డీల్‌ ఖైదీని మించిన త్రిల్లర్‌ స్టోరీ ఇది

ముల్లును ముల్లుతోనే తీయాలి అనే డైలాగ్‌ ఈ ఆఫీసర్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో అభివృద్ధికి దొంగలు అడ్డుగా మారుతున్నారో అదే ప్రాంతంలో వాళ్లతోనే శాంతి నెలకొనేలా చేశాడు ఈ ఆఫీసర్‌. ఈయన పేరు KK మహ్మద్‌. అర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌.

  • Written By:
  • Publish Date - August 30, 2024 / 10:10 PM IST

ముల్లును ముల్లుతోనే తీయాలి అనే డైలాగ్‌ ఈ ఆఫీసర్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో అభివృద్ధికి దొంగలు అడ్డుగా మారుతున్నారో అదే ప్రాంతంలో వాళ్లతోనే శాంతి నెలకొనేలా చేశాడు ఈ ఆఫీసర్‌. ఈయన పేరు KK మహ్మద్‌. అర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌. చాలా మందికి ఈయన తెలియకపోవచ్చు.. కానీ బాబ్రీ మసీద్‌, రామమందిర నిర్మాణం స్టోరీ ఫాలో ఐనవాళ్లకు ఈయన చాలా సుపరిచితుడు. కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బటేశ్వరాలయం పునరుద్ధరణ పనులు మహ్మద్‌కు అప్పగించింది ప్రభుత్వం.

కానీ ఆ ఏరియా అప్పటికే దొంగల భయంతో వణికిపోతోంది. ఆలయాలను దోచేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దాదాపు 200 ఆలయాలను ఈ టాస్క్‌లో పునరుద్దరించాలి. కానీ వరుస చోరీలతో గుడుల రిస్టోరేషన్‌ పనులకు దొంగలు అడ్డుపడుతున్నారు. స్ట్రెయిట్‌ రూట్‌లో వెలితే పని అయ్యేలా లేని తెలుసుకున్న మహ్మద్‌ బ్యాక్‌ రూట్‌లో వెళ్లడం ప్రారంభించారు. చోరీలకు పాల్పడే వాళ్లను పిలిపించి మాట్లాడారు. ఇలాంటి చోరీలు ఆపేస్తే ప్రతీ ఒక్కరికి జీవనోపాధి కల్పించేలా ప్రభుత్వం నుంచి సాయం చేస్తానంటూ వాళ్లతో డీల్‌ మాట్లాడుకున్నారు.

ఆలయాలను తిరిగి నిర్మించే బాధ్యతలో వాళ్లను కూడా భాగస్వాములనున చేస్తానన్నారు. బతిమాలారో భయపెట్టారో తెలియదు కానీ.. ఆయనతో సిట్టింగ్‌ తరువాత అక్కడ ఆలయాల మీద చోరీలు ఆగిపోయాయి. అప్పటి నుంచి చాలా వేగంగా పనులు ప్రారంభించి ఇప్పటికే 80 గుళ్లను తిరిగి నిర్మించారు. త్వరలోనే మొత్త గుళ్లను పునరుద్దరించబోతున్నారు. గతంలో బాబ్రీ మసీదు విషయంలో కూడా మసీదు కింద నిజంగానే గుడి ఉందని మొదట నిర్ధారించింది ఈయన. ఈయన ఇచ్చిన రిపోర్ట్‌తోనే రామ మందిర నిర్మాణానికి మొదటి అడుగు పడింది. పుట్టింది ముస్లీంగానే ఐనా.. కోట్ల మంది హిందువుల చిరకాల కోరిక రామమందిర నిర్మాణంలో KK మహ్మద్‌ పాత్ర చిరస్మరనీయం.