PayTM: కిరాణ షాపుట్లో పేటీఎం గాయాబ్..! కొత్త యాప్‌లు వాడుతున్న షాప్ ఓనర్లు

దేశంలో 42 శాతం కిరాణా స్టోర్స్‌లో పేటీఎం యాప్ తీసేసి.. వేరే యాప్ పెడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. కిరాణ క్లబ్ అనే సంస్థ జరిపిన సర్వేలో RBI ప్రకటన తర్వాత పేటీఎం క్రమంగా జనాదరణ కోల్పోతోంది.

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 02:26 PM IST

PayTM: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పేటీఎంపై ఆంక్షలు పెట్టడంతో ఇప్పుడు చాలా కిరాణా షాపుల్లో ఆ యాప్‌ను తీసేస్తున్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరగడంలో ఫిన్ టెక్ కంపెనీలది కీలకపాత్ర. అందులో పేటీఎందే అగ్రస్థానం. గ్రామాల్లో ఉండే కిరాణా కొట్టు దగ్గర కూరగాయల వ్యాపారులు, పూలు, పండ్లు అమ్ముకునే వారి నుంచి వీధి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరూ పేటీఎం యాప్‌ను వాడుతున్నారు. జనం కూడా చాలామంది జేబుల్లో డబ్బులు వేసుకోవడం మానేశారు.

EAGLE REVIEW: ఈగల్ రివ్యూ.. యాక్షన్ ఫీస్ట్.. రవితేజ ఊచకోత నెక్ట్స్ లెవల్

మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు. అలా జన జీవితంలో కలిసిపోయిన పేటీఎం యాప్ పేమెంట్స్ బ్యాంక్‌కు కష్టాలు మొదలయ్యాయి. దేశంలో 42 శాతం కిరాణా స్టోర్స్‌లో పేటీఎం యాప్ (Pay TM app) తీసేసి.. వేరే యాప్ పెడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. కిరాణ క్లబ్ అనే సంస్థ జరిపిన సర్వేలో RBI ప్రకటన తర్వాత పేటీఎం క్రమంగా జనాదరణ కోల్పోతోంది. ఈ యాప్ ద్వారా సేల్స్ కూడా 68శాతం పడిపోయాయి. పేటీఎంను తీసేస్తున్న కిరాణ షాపుల్లో 50 శాతం మంది వ్యాపారులు ఫోన్ పేను (Phone pay) వాడాలని డిసైడ్ అయ్యారు.

మరో 30శాతం మంది గూగుల్ పేను(Google Pay) కోరుకుంటే.. 10శాతం మంది భారత్ పేను (Bharat Pay) వాడతామని చెబుతున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Pay TM payments bank) కార్యకలాపాలను నిర్వహించవద్దని RBI ఆదేశించింది. అయితే పేటీఎం ప్రతినిధులతో ఆర్బీఐ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారనీ.. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని RBI డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ తెలిపారు.