దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు (General Elections) దశల వారిగా మొదలవనుంది. సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసుకోని.. రేపు లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం.. రెండో దశ పోలింగ్ ప్రారంభం కానుంది.
ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్ ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. కేరళలోని 20 లోక్ సభస్థానాలు, కర్ణాటక- 14, రాజస్థాన్- 13, మహారాష్ట్ర- 8, ఉత్తరప్రదేశ్- 8, మధ్యప్రదేశ్- 6, అసోం, బీహార్ లో చెరో 5 స్థానాలు, ఛత్తీస్గఢ్, బెంగాల్అలోని చెరో 3స్థానాలు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్ లో 1 చెరో స్థానానికి పోలింగ్ జరగనుంది.