రాబోయే సార్వత్రిక ఎన్నికల (General Elections) కోసం ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) మరోసారి వారణాసి (Varanasi) నుంచే బరిలోకి దిగుతున్నారు. ఈసారి మోడీకి పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్ బరిలో నిలుస్తున్నారు. హేమాంగి సఖి మాత… అనే ట్రాన్స్‌జెండర్ (Transgender) వారణాసి లోక్ సభ సీటుకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు నరేంద్ర మోడీ. ఈసారి కూడా అక్కడే గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధానిగా కావాలని భావిస్తున్నారు. మోడీకి పోటీగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఈ వారణాసి నియోజకవర్గం నుంచి ఓ ట్రాన్స్‌జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ తరఫున హేమాంగి సఖి నిలబడుతున్నారు. మహామండలేశ్వర్ హేమంగి సఖి మాత గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్. ఆమె శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు. అఖిల భారత హిందూ మహాసభ.. ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధానికి పోటీగా వారణాసిలో హేమాంగి సఖి మాతను నిలబెట్టింది.
గుజరాత్‌లోని బరోడాలో ఈ హేమాంగి సఖి మాత జన్మించారు. తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో కుటుంబం గతంలోనే ముంబైకి వలస వెళ్లింది. భగవద్గీతను అనర్గళంగా బోధించే మొదటి ట్రాన్స్‌జెండర్ కథకురాలిగా హేమాంగి సఖి మాత నిలిచారు. 2019 ఆచార్య మహామండలేశ్వర్‌గా హేమాంగి సఖికి పట్టాభిషేకం చేశారు.