Bihar CM, Nitish Kumar : నీతిలేని.. నితీష్‌

అవసరానికి దారులు తొక్కే పాత్రలు తప్ప.. ఇంకేమీ కనిపించవ్‌. రాజకీయం అంటే టక్కున వినిపించే మాట ఇది. అలాంటి ఓ దారి కోసం... అసరాలను అడ్డం పెట్టుకొని ఆడుకునే నాయకులు ఏమంటారు. నీతి మాలిన వాళ్లే కదా అనేది ! నితీష్ అలాంటివాడే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నీతి లేని నితీష్ అతను. తన అహం నెగ్గించుకోవడానికి.. అవసరం తీర్చుకోవడానికి..

అవసరానికి దారులు తొక్కే పాత్రలు తప్ప.. ఇంకేమీ కనిపించవ్‌. రాజకీయం అంటే టక్కున వినిపించే మాట ఇది. అలాంటి ఓ దారి కోసం… అసరాలను అడ్డం పెట్టుకొని ఆడుకునే నాయకులు ఏమంటారు. నీతి మాలిన వాళ్లే కదా అనేది ! నితీష్ అలాంటివాడే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నీతి లేని నితీష్ అతను. తన అహం నెగ్గించుకోవడానికి.. అవసరం తీర్చుకోవడానికి.. నీతి, నిజాయితీ అనే పదాలను గోదాంల్లో వేసి తొక్కేసే రకం నితీష్‌ (Nitish Kumar). బిహార్‌ (Bihar)లో రాజకీయ పరిణామాల వేళ ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటోంది ఇలాంటి మాటలే ! బీజేపీ(BJP)తో దోస్తీ నయ్ అన్నారు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రభుత్వానికి సై అన్నారు. విపక్ష కూటమి లీడర్‌ తానే అని బిల్డప్ ఇచ్చారు. మళ్లీ ప్రధాని అయ్యేంత సీన్ మోదీకి లేదు అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. కట్ చేస్తే… ఎవరితో దోస్తీ అని చేతులు కలిపారో.. వారికే హ్యాండ్ ఇచ్చారు.

ఏ కమలంతో కయ్యం పెట్టుకున్నారో.. వాళ్లతోనే ఇప్పుడు కలిసుందాం రా అంటున్నారు. ఇది చాలు నితీష్ కేరక్టర్ ఏంటో.. నితీష్‌ నీతి, నిజాయితీ గురించి చెప్పడానికి ! చొక్కా మార్చినంత ఈజీగా కూటమి మార్చేస్తాడు. గెలుపు ఎటు మొగ్గుతుందో అటు జంప్ అయిపోతుంటాడు క్షణాల్లో ! మిత్ర ధర్మం అనేది లేదు.. రాజకీయ శత్రుత్వం అనేది అసలే పట్టదు. పదవి కోసం ఎవరితోనైనా జతకట్టే తత్వం.. కాదు కాదు ఎంతకైనా దిగజారే నైజం. నిన్నటివరకు తిట్టిన వాటిపై.. ఇవాళ సిగ్గులేకుండా ప్రశంసలు గుప్పిస్తారు. నిన్న ప్రశంసలు గుప్పించిన వారి పరువును.. ఇవాళ ఈజీగా తీసేస్తారు.. దటీజ్ నితీష్‌.. దటీజ్ హిజ్ నిజాయితీ అంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. నైతికత లేని నేటి రాజకీయాలకు అసలైన రూపం ఎవరైనా ఉన్నారా అంటే.. అది నితీష్ అనడంలో ఎలాంటి అనుమానంలేదు. అదేదో బూమరాంగ్ ఆడినట్లు.. షటిల్‌ బస్సు తిరిగినట్లు.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. తిరుగుతూ.. అవసరాలు తీర్చేసుకుంటారు నితీష్‌.

బీజేపీ (BJP), కాంగ్రెస్ కూటముల మధ్య ఆయనవి ఎప్పుడూ షటిల్‌ సర్వీసులే ! ఎప్పుడు కావాలంటే అప్పుడు.. యూటర్న్ తీసుకుంటారు. కూటమి ఏదైనా, సీట్లు ఎవరికి ఎక్కువ ఉన్నా.. సీఎం మాత్రం ఆయనే అవుతారంటే.. అర్థం చేసుకోవచ్చు.. నితీష్‌ ఆటలు ఎలా ఉంటాయో.. రాజకీయం ఎలా ఉంటుందో.. నీతిలేనితనం ఎలా ఉంటుందో ! 2013నుంచి ఇప్పటికి ఐదుసార్లు కూటమి మార్చిన నితీష్‌ కుమార్‌.. నేషనల్ జంపింగ్ స్టార్ అయిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిహార్‌లో రాజకీయ సంక్షోభం చల్లారింది. మళ్లీ నితీష్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకోవడం.. ఇది 9వసారి ! నితీష్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. మొదటి నుంచి ఎక్కడా నిజాయితీ, నీతి కనిపించదు. 1994లో లాలూకి వ్యతిరేకంగా జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన నితీష్.. జార్జ్ ఫెర్నాండేజ్‌తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు
చేశారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరారు.

అక్కడ ఎక్కువ రోజులు ఉన్నారా అంటే.. 2013లో కమలానికి బైబై చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా ఉంటానని ఆశపడి.. అది నెరవేరకపోవడంతో.. నోటికొచ్చిన కామెంట్లు చేసి.. బీజేపీకి దూరం అయ్యారు. మోద మత రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్లు చేశారు. బీజేపీతో మళ్లీ ఎక్కువ రోజులు ఉన్నారా అంటే.. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి నితీష్‌ కూటమి కట్టారు. ఐతే 2017లాలూపై అవినీతి ఆరోపణలు రావడంతో.. ఆర్జేడీ కూటమిని నితీష్‌ వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ కమలానికి మద్దతుగా నిలిచారు. అక్కడితో ఆగారా అంటే.. మళ్లీ బీజేపీతో పంచాయితీ పెట్టుకొని.. విపక్ష పార్టీలకు లీడర్ తానే అంటూ.. నితీష్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. తీరా ఇండియా కూటమి ఏర్పాటు అయ్యాక.. కాంగ్రెస్‌కు, ప్రధాన విపక్షాలకు హ్యాండ్ ఇచ్చారు.

తన దారి.. అడ్డదారి అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసి.. బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇలా నీతిలేని రాజకీయానికి కేరాఫ్‌గా మారారు నితీష్. దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయ్‌.. ఎవరిని చూస్తే రాజకీయం అర్థం చేసుకోవచ్చు అంటే.. నితీష్ కటౌట్‌ను ముందు పెడితే చాలు.. అన్నీ తెలిసిపోతాయ్ ఆటోమెటిక్‌గా!