ఇండియన్ పాలిటిక్స్‌లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ. 50 ఏళ్ల దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడిగినా రాహుల్ గాంధీ నవ్వి వెళ్లిపోతారే తప్ప సమాధానం మాత్రం చెప్పరు అని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తుంటారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు 54 ఏళ్లు. దీంతో ఇక వెయిట్ చేయకుండా రాహుల్‌కు భార్యను వెతకాలని ప్రియాంక గాంధీ డిసైడ్ ఐనట్టు కాంగ్రెస్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమే ప్రణతి షిండే. చూసేందుకు వీళ్ల ఈడు జోడు కూడా చక్కగా ఉండటంతో ఈమే రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. అధికారిక ప్రకటన మాత్రమే తరువాత మితగా మాటలన్నీ ఐపోయాయి అనే టాక్ నడుస్తోంది. రాహుల్ చేతిలో చేయి వేసి నడుస్తున్న ఈమే బ్యాగ్రౌండ్ కూడా తక్కువేం కాదు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురే ఈ ప్రణతి షిండే. ప్రస్తుతం షోలాపూర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. 19820 డిసెంబర్ 9న జన్మించిన ప్రణతి షిండే వయసు ఇప్పుడు 42 ఏళ్లు. షోలాపూర్ ఎంపీగానే కాకుండా మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ కంప్లీట్ చేశారు ప్రణతి. రాజకీయాల మీద ఇంట్రెస్ట్‌తో తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం నుంచి నమ్మిన మంటుగా కాంగ్రెస్ పార్టీకి కాపుకాస్తున్నారు. పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆమెను రాహుల్ ఫ్యామిలీకి దగ్గర చేసింది. మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు. ప్రణతి చేయిపట్టుకుని రాహుల్ నడిచిన ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం పార్టీకి విధేయురాలిగా ఉండటంతో ప్రణతితోనే రాహుల్ పెళ్లి చేయించే ప్రయత్నాల్లో ప్రియాంక గాంధీ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.