Mehdipatnam Skywalk : మెహిదీపట్నంలో స్కైవాక్ ప్రాజెక్టు రూపురేఖలు..

హైదరాబాద్ నగర వాసులకు మరో గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో స్కైవాక్. మెహదీపట్నంలో పీవీ ఎక్స్ ప్రెస్ వే ఫ్లైఓవర్ కింది నుంచి నిర్మాణం. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నిర్మించిన స్కైవాక్ మాదిరిగానే మెహిదీపట్నం వద్ద నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం.

1 / 10

నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు, పాదాచారుల కోసం మరో స్కైవాక్.

2 / 10

ఫ్లైఓవర్‌ పై నుంచి అటు, ఇటు బస్టాండ్‌లను కలుపుతూ ఓ ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్‌లు సిద్ధం.

3 / 10

రైతుబజార్‌ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ వరకు స్కైవాక్‌ అనుసంధానం.

4 / 10

రైతు బజార్‌ పక్కన ఉన్న 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బస్‌ బే ఉండే విధంగా నిర్మాణం.

5 / 10

పాదాచారుల కోసం 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో స్కైవాక్ నిర్మాణం.

6 / 10

స్కైవాక్ లో మెట్లు, 16 లిఫ్ట్‌లు, 12 మి.మీ మందపాటి పటిష్టమైన గ్లాస్‌ పేట్‌లను ఏర్పాటుచేయనున్నారు.

7 / 10

గుడి మల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహదీపట్నం బస్టాండ్‌ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్‌ వరకు ఈ స్కైవాక్‌ నిర్మాణం

8 / 10

మెహిదీపట్నం స్కైవాక్ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.34.28 కోట్లు అంచనా.

9 / 10

ఇరువైపులా 2.5 ఎత్తు మీటర్ల స్టీల్‌ గ్రిల్స్‌ ఏర్పాటు, 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పుతో స్కైవాక్ నిర్మాణం.

10 / 10

నూతన రైతు బ‌జార్‌లో రెండు లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేసేందుకు డిజైన్ రూపొందించారు.