China : చైనాలో కొత్త వైరస్.. వందలాదిగా పిల్లలు అనారోగ్యపాలు.. పిల్లలతో నిండి పోతున్న చైనా ఆసుపత్రిలు..

చైనాను వణికిస్తున్న మరో వైరస్.. వందలాదిగా పిల్లలు అనారోగ్యపాలు.. పిల్లలతో నిండి పోతున్న చైనా ఆసుపత్రిలు..

1 / 17

చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి కరోన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.

2 / 17

ఇప్పుడు అదే చైనా నుంచి మరో వ్యాధి వ్యాపిస్తుండటం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది.

3 / 17

ఈ క్రమంలోనే డ్రాగన్ దేశం కలవరపడుతోంది. న్యుమోనియా లక్షణాలతో అక్కడి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

4 / 17

బుధవారం ఉదయం చిన్నారుల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

5 / 17

ఈ క్రమంలోనే ప్రోమెడ్‌ సంస్థ అప్రమత్తం చేసింది.

6 / 17

దీనివల్ల ముఖ్యంగా చిన్నారుల్లో రెస్పిరేటరీ సమస్యలు చాలా వస్తున్నాయి.

7 / 17

రోజు రోజుకూ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ఈ విషయంపై స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది.

8 / 17

అయితే ఇది ఏమాత్రం ప్రమాదకారి.. కాదని చెప్తోంది చైనా దేశం.

9 / 17

ముఖ్యంగా చిన్నారుల్లోనే ఈ న్యుమోనియా వ్యాప్తి అధికంగా ఉందని.. ఆ కారణంగానే ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్టు చెప్పింది.

10 / 17

ఉత్తర చైనాలో న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరడంపై WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలివ్వాలని చైనాను కోరింది.

11 / 17

ఏకకాలంలో వందలాదిగా పిల్లలు అనారోగ్యానికి గురికావడం మాములు విషయం కాదని ఆ సంస్థ తెలిపింది.

12 / 17

అసలు ఈ జబ్బు ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాకపోయినా, పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్య నిపుణులు, సంస్థలు అనుమానిస్తున్నాయి.

13 / 17

ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రోమెడ్ ప్రతినిధులు అన్నారు.

14 / 17

చైనాలో ఈ న్యుమోనియా వ్యాప్తితో భారత్ అప్రమత్తమైంది.

15 / 17

చైనాలో ఉన్న పరిస్థితులను, చిన్నారులపై వ్యాధి ప్రభావాన్ని భారత ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది.

16 / 17

వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ విచారణ

17 / 17

ప్రస్తుతానికి చైనా వెళ్లేవాళ్లకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ పెట్టడంలేదని.. వ్యాధి తీవ్రతను బట్టి త్వరలో ఆలోచిస్తామని తెలిపింది.