Bhogi celebrations : భోగి వేడుకల్లో సందడి చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ఆదివారం ఉదయం భోగి వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో 'తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం చంద్రబాబు తెలుగు సంప్రదాయబద్దంగా అడ్డ పంచె కట్టుకుని సందడి చేశారు. భోగి మంటలు వెలిగించిన అనంతరం.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, ప్రజా వ్యతిరేక జీవోల కాపీలను మంటల్లో తగలబెట్టారు.

1 / 8
2 / 8
3 / 8
4 / 8
5 / 8
6 / 8
7 / 8
8 / 8