Fire Accident: మంటల్లో దగ్ధమైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు.. (ఫోటోలు)

హౌడా నుంచి సికింద్రాబాద్ వరకూ ప్రయాణించే ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ లో తీవ్రమైన మంటలు చెలరేగాయి. దాదాపు ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న లోకో పైలెట్ రైలును ఉన్నచోటే నిలిపి వేయడంతో ప్రయాణికులు క్రిందకు దిగేశారు. దీంతో ప్రాణ‎నష్టం సంభవిచలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 02:40 PM IST
1 / 12

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది

2 / 12

మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

3 / 12

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ షాట్ సర్క్యూట్ కి గురైంది

4 / 12

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటూ స్థానిక పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు

5 / 12

పూర్తిగా కాలి బూడిదైన బోగీలు

6 / 12

అప్రమత్తమైన లోకోపైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశారు

7 / 12

ముందుగా ఎస్ 4, ఎస్ 5 బోగీల్లో మంటలు చెలరేగాయి

8 / 12

ఈ రెండు బోగీల కారణంగా వాటికి పక్కనున్న బోగీలకు మంటలు వ్యాపించాయి

9 / 12

నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి

10 / 12

ప్రయాణీకులను సికింద్రాబాద్ చేర్చేందుకు ప్రత్యేక బస్సులతో పాటూ లోకమాన్య తిలక్ రైలును ఏర్పాటు చేశారు.

11 / 12

ప్రయాణీకుల లగేజీ మొత్తం మంటల్లో కాలి బూడిదవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

12 / 12

సమయానికి అందరూ అప్రమత్తం అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు