Chandrayaan3 (ISRO) : చంద్రయాన్ 3 బృందాన్ని అభినందించిన ప్రధాని మోదీ..

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావ‌త్ భార‌తం స‌లాం చేస్తుంద‌న్నారు. 140 కోట్ల భార‌తీయులంతా మీరు సాధించిన విజ‌యాన్ని చూసి గ‌ర్విస్తున్నారు.

1 / 22

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు.

2 / 22

మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో జాతీయ జెండాలతో ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు.

3 / 22

HAL విమానాశ్రయం వెలుపల, ISTRAC కి దగ్గరగా ఉన్న జలహల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున మోదీకి ప్రజలు స్వాగతం పలికారు.

4 / 22

ఇదివరకు ఇంటింటికీ జాతీయ జెండా మాత్రమే.. ఇప్పుడు చంద్రునిపైన కూడా మన జాతీయ జెండా ఎగురుతోందన్నారు.

5 / 22

చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్త లను అభినందించారు.

6 / 22

చంద్రయాన్-3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు.

7 / 22

ఇస్రో విజయం అసాధారణం.. శాస్త్రవేత్తలకు సెల్యూట్.. మోదీ

8 / 22

ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని.

9 / 22

ప్రధాని మోదీని చూసేందుకు చిన్న పిల్లలు సైతం తరలివచ్చారు.

10 / 22

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.

11 / 22
12 / 22

ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ కార్యాలయానికి రోడో షో నిర్వహించారు మోదీ.

13 / 22

ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు మోదీ అభినందనలు .

14 / 22

చంద్రయాన్-2 వైఫల్యం తో మనం వెనకడుగు వేయలేదన్నారు.

15 / 22

చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.

16 / 22

చంద్రయాన్ 3 ల్యాండర్ పని తీరును మోదీకి వివరిస్తున్న సోమనాథ్

17 / 22

మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహం ఈ విజయం

18 / 22

శాస్త్రవేతలకు అభివాదం చేస్తు ఇస్రోలోకి అడుగు పెట్టిన మోదీ

19 / 22

ఈ సందర్భంగా చంద్రయాన్ 3 ల్యాండర్ తీసిన తొలి ఫోటోను సోమనాథ్ మోదీకి బహుకరించారు.

20 / 22

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.

21 / 22

ఈ సందర్భంగా ఆదిత్య ఎల్1, గగన్‌‌యాన్‌ల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.

22 / 22

ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి గ్రూప్ ఫోటో..