New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం లోపలి చిత్రాలు..

అత్యంత సుందరంగ, సరికొత్త హంగులతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. సువిశాలమైన ప్రాంగణం.. ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసి చుట్టూ పచ్చని చెట్లను పెంచి అహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక భవనం లోపల ప్రతి మూల ఒక అద్భుతమైన పనితీరును కనబరిచారు. ఫ్లోరింగ్ మొదలు కూర్చునే చైర్ వరకూ.. సచివాలయ ఉద్యోగులు పనిచేసే డెస్క్ మొదలు వీఐపీలు భోజనం చేసే డైనింగ్ హాల్ వరకూ ప్రతి ఒక్కటి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆరవ అంతస్తులోని సీఎం క్యాబిన్ మరింత హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 04:48 PM IST
1 / 19

తెలంగాణ కొత్త సచివాలయం

2 / 19

సచివాలయం లోపల ప్యాక్ చేసి ఉంచిన కొత్త ఫర్నీచర్

3 / 19

పది మంది అతిథులు వచ్చినా కూర్చొని మాట్లాడేలా నిర్మించిన ముఖ్యమంత్రి గది

4 / 19

ఆరు అంతస్తుల్లో నిర్మించిన ప్రాంగణంలోపల తిరిగేందుకు చుట్టూ పాలరాతి ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు

5 / 19

ప్రవేశ ద్వారం గుండా లోనికి వెళ్తూనే పైకి వెళ్లేందుకు సువిశాలమైన మెట్లు ఏర్పాటు చేశారు.

6 / 19

సచివాలయానికి బయట ప్రాంగణంలో అంబేద్కర్ పేరు కనిపిస్తుంది

7 / 19

సచివాలయం లోపల ఆరు అంతస్తుల్లో నాలుగు మార్గాలు ఉంటాయి. ఇది సీఎం పేషీకి వెళ్లే కారిడార్. ప్రత్యేక మార్బుల్ తో కనువిందు చేస్తుంది

8 / 19

సచివాలయం పైనున్న తిరంగా నుంచి బయటకు చూస్తే హూస్సేన్ సాగర్ ఇలా కనిపిస్తుంది

9 / 19

ఒక భవనం నుంచి మరొక భవనానికి మధ్య గ్రీన్ గార్డెన్ ఉంది

10 / 19

అత్యాధునిక వసతులతో ముస్తాబవుతున్న ముఖ్యమంత్రి చాంబర్‌

11 / 19

ముఖ్యమంత్రి ఛాంబర్ లోనికి ప్రవేశించేే ప్రదాన ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు

12 / 19

ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అత్యంత హంగులతో నిర్మించిన కాన్ఫిడెన్స్ హాల్

13 / 19

సచివాలయ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వాష్ రూములు, విశాలమైన హ్యాండ్ వ్యాష్ ఏరియా

14 / 19

ముఖ్యమంత్రి ఏదైనా ప్రత్యేక రోజుల సందర్భంగా ముఖ్య అతిథులతో కలిసి భోజనం చేసేందుకు నిర్మించిన డైనింగ్ టేబుల్ సరికొత్త డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది

15 / 19

మహారాజుల కాలంనాటి దర్భార్ ఉట్టిపడేలా తలుపులకు సింహం రూపాన్ని అలంకరించారు.

16 / 19

స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న సెంట్రల్ ఏసీ వీఐపీ లాంచ్.

17 / 19

మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు అత్యంత హంగులతో కూడిన క్యాబినెట్ మీటింగ్ హాల్

18 / 19

సచివాలయంలో ఆయా శాఖ ఉద్యోగులకు విధులు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేసిన డెస్కులు

19 / 19

ముఖ్యమంత్రితోపాటూ ఏ ఇతర వీఐపీలు సచివాలయానికి చేరుకునేందుకు ప్రాంగణం ముందు భాగంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.