Srivari Brahmotsavam : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ..

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి.

1 / 25

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

2 / 25

శ్రీవారి బ్రహ్మోత్సవాలకుఅంకురార్పణ.. మాడవీధుల్లో విశ్వక్‌సేనుడి ఊరేగింపు

3 / 25

వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

4 / 25

శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు.

5 / 25

అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు.

6 / 25

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.

7 / 25

ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

8 / 25

జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు.

9 / 25

ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.

10 / 25

ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.

11 / 25

అంకురార్పణంలో నాటే పవిత్ర విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.

12 / 25

విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

13 / 25

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు.

14 / 25

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు.

15 / 25

అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

16 / 25

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

17 / 25

బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహ‌ణం, పెద్దశేష వాహ‌నం.

18 / 25

ఉదయం చిన్నశేష వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం సాయంత్రం హంస వాహ‌నం.

19 / 25

ఉదయం సింహ వాహ‌నం సాయంత్రం ముత్యపుపందిరి వాహ‌నం.

20 / 25

ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నం, సాయంత్రం సర్వభూపాల‌ వాహ‌నం.

21 / 25

ఉదయం మోహినీ అవ‌తారం, సాయంత్రం గరుడ‌సేవ‌.

22 / 25

ఉదయం హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం గ‌జ వాహ‌నం.

23 / 25

సూర్యప్రభ వాహ‌నం, సాయంత్రం చంద్రప్రభవాహనం.

24 / 25

ర‌థోత్సవం, సాయంత్రం అశ్వ వాహ‌నం.

25 / 25

ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం సాయంత్రం ధ్వజావ‌రోహ‌ణం.