X
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
Home
»
Photo Gallery
»
World Famous Dishes
WORLD FAMOUS DISHES: ప్రపంచలోని వివిధ దేశాల సుప్రసిద్ద వంటకాలు..!
Written By:
Srikar Creator
Updated On - February 7, 2023 / 11:46 AM IST
1
/ 10
ఈ కనువిందైన పదార్ధం పేరు సుషీ.. జపాన్ లోని రెస్టారెంట్లలో ప్రత్యేకమైన వంటకం. వెనిగర్డ్ రైస్, సీఫుడ్, కూరగాయలు, కొన్ని రకాలా పండ్లతో తయారు చేస్తారు. అల్లం, సోయా సాస్‌తో వడ్డించినప్పుడు ఈ ఐటెం చాలా రుచిగా ఉంటుంది.
2
/ 10
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఐటెం పేరు టామ్ యామ్ గూంగ్. థాయిలాండ్ నగరపు స్థానిక ఫుడ్. ఇందులో రొయ్యలతోపాటూ ఆరోగ్యకరమైన మూలికలు సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇందులో కాఫీ ఆకులు, లెమన్, పండుమిర్చిని ఉపయోగిస్తారు. ఇది ఒకరకమైన పుల్లని రుచితో ఉంటుంది. ఇంకాస్త రుచిగా మార్చడానికి కొబ్బరి పాలను కలుపుతారు.
3
/ 10
ఈ ఫోటోలో కనిపించే వంటకం పేరు కబాబ్స్. టర్కీకి చెందిన ఫేమస్ డిష్. సముద్రపు ఆహారం, పండ్లు, మాంసం ముక్కలు, కూరగాయలను గ్రిల్‌పై బార్బెక్యూ వలె పెద్ద మంటతో స్కేవర్‌పై వండుతారు. ఇందులో వెల్లుల్లి, నల్ల మిరియాలు, ఆలివ్ నూనెతో వండుతారు.
4
/ 10
దీనిపేరు ఫూహ్. వియాత్నాం నగరపు వింతైన స్ట్రీట్ ఫుడ్. బియ్యపు నూడుల్స్, మాంసం, గుడ్డుతో తయారు చేస్తారు. శీతాకాలంలో సాయంత్రంపూట తినడానికి ఎక్కవ ఆసక్తిని కనబరుస్థారు అక్కడి స్థానికులు.
5
/ 10
ఇక్కడ చూడటానకి సింపుల్ గా కనిపించే వంటకం పేరు పెకింగ్ డక్. ఇది చైనా దేశంలోని బీజింగ్‌కు చెందిన ఒక వంటకం. ఈ వంటకం కోసం బాతులను 60రోజులపాటూ ప్రత్యేకంగా పెంచుతారు. ఇందులో దోసకాయలు, స్ప్రింగ్ ఆనియన్ తో పాటూ స్వీట్ బీన్స్ సాస్‌తో వడ్డిస్తారు. ఈడిష్ ను భోజనానికి ముందు మూడు భాగాలుగా కట్ చేసి ఇస్తారు. మొదటి భాగాన్ని చక్కెరతో.. రెండవ భాగాన్ని వెల్లుల్లి సాస్ తో మిగిన భాగాన్ని బాతును ఉడకబెట్టిన పులుసుతో వడ్డిస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతారు.
6
/ 10
ఈ ఆకర్షణీయమైన డిష్ పేరు పెల్లా. ఇది స్పెయిన్ దేశానికి చెందిన ప్రత్యేక వంటకం. ఇది ప్రస్తుత కాలానుగుణంగా దీనిరుచిని మార్చి తయారు చేస్తున్నారు. ఇది చాలా పురాతనమైన వంటకం. దీనిని తినడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఒరిజినల్ రెసిపీలో గ్రీన్ బీన్స్, మాంసం, బటర్‌బీన్స్, నత్తలు, రోజ్‌మేరీ వంటి మసాలాలతో పాటూ మంచి ఆలీవ్ ఆయిత్ తో నాణ్యమైన తెల్ల బియ్యంతో వండుతారు. అందుకే ప్రపంచంలోని ఉత్తమ వంటకాలలో ఇది ఒకటి.
7
/ 10
రొట్టె ఆకారంలో ఉండే దీని పేరు స్టీక్ అండ్ కిడ్నీ పై. ఇది ఇంగ్లాండుకు చెందిన డిష్. ఇందులో గుడ్డు, మాంసం, ఉల్లిపాయలు, మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. బిట్రన్ వంటకాల్లో ఇది సాంప్రదాయ వంటకం. ఇది చాలా ఖరీదైన ఐటెంగా చెబతారు.
8
/ 10
పఫ్ ఆకారంలో కనిపించే దీనిపేరు ఆఫెల్ స్ర్టడెల్. ఇది ఆస్ట్రియా, ఐరోపాలోని ఇతర ప్రాంతాలలో ఒక ప్రసిద్ధ పేస్ట్రీ. ఇందులో తురిమిన ఆపిల్, దాల్చిన చెక్క, చెక్కర, బ్రెడ్, ఎండుద్రాక్షలతో తయారు చేస్తారు. కొన్ని సార్లు వీటిని క్రీమ్ తో సర్వ్ చేసుకుంటారు.
9
/ 10
దీనిపేరు లాసాగ్నా పిజ్జా. ఇటలీకి చెందిన ఉత్తమ ఆహార వంటకాల్లో ఒకటిగా స్థానం సంపాదించింది. ఇది పురాతన పాస్తాలో ఒకటి. ఇందులో టమోటా సాస్, చీజ్, కూరగాయలు, మాంసం ముక్కలు, పాస్తా తో తయారు చేస్తారు.
10
/ 10
డెకోరేటెడ్ గా కనిపించే దీనిపేరు కిమ్చి. ఇది కొరియన్ ముల్లంగి, మరియు క్యాబేజీ వంటి పులియబెట్టిన కూరగాయల నుండి తయారు చేయబడిన ఒక ప్రధానమైన కొరియన్ సైడ్ డిష్. ఇందులో వెల్లుల్లి, మిరపకాయలు, అల్లంతో సహా అనేక మసాలాలతో తయారు చేస్తారు. కొరియాలోని చాలా రెస్టారెంట్లలో స్టార్టర్‌లుగా ఉచితంగా విక్రయించబడతాయి. ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి తోపాటూ తక్కువ కేలరీలు ఉంటాయి.
ASTRIA
CHINA
CORIAN
ENGLAND
ITALI