వరదల్లో చిక్కుకున్న ఏపీ.. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ…

భారీ వర్షాలు.. ఏపీని చుట్టేశాయ్. అక్కడ ఇక్కడ అని తేడా లేదు.. స్టేట్ అంతా కుమ్మేస్తున్నాయ్ వానలు. విజయవాడ పరిస్థితి అయితే మరీ దారుణం. నగరం అంతా చెరువులా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - September 2, 2024 / 06:48 PM IST

భారీ వర్షాలు.. ఏపీని చుట్టేశాయ్. అక్కడ ఇక్కడ అని తేడా లేదు.. స్టేట్ అంతా కుమ్మేస్తున్నాయ్ వానలు. విజయవాడ పరిస్థితి అయితే మరీ దారుణం. నగరం అంతా చెరువులా మారిపోయింది. ఇళ్లలోకి నీళ్లు.. వరదల్లోకి బాధితులు.. అన్నమో రామచంద్రా అంటున్నారు బెజవాడవాసులు. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అధికారులతో రివ్యూలు నిర్వహించి.. సహాయ చర్యలు వేగవంతం అయ్యేలా చేశారు. ఐతే విజయవాడ ఇంతలా అల్లాడిపోతున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం కనిపించడం లేదు. దీంతో పవన్ ఎక్కడ అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి.. ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తున్నారు పవన్‌. అలాంటిది ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తి.. అతలాకుతలం చేస్తున్న వేళలో జాడ లేకుండా పోవడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పవన్ ఎక్కడా కనిపించలేదు. ఐతే సెప్టెంబర్‌ 2.. పవన్ పుట్టినరోజు. బర్త్‌ డే సందర్భంగా.. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లారా అనే చర్చ నడుస్తోంది. బయటకు వెళ్లి ఉంటే.. తాను అందుబాటులో లేని విషయాన్ని తెలియజేయటం.. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించటం లాంటివి చేయొచ్చు. టూర్ ఆపేసుకొని తిరిగి వచ్చేయొచ్చు. ఐతే ఆయన ఆయన ఎక్కడకు వెళ్లారో.. ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆపద కాలంలో అందరికి అందుబాటులో ఉండి.. ముందుండి నడిపించాల్సిన పవన్ ఎక్కడా కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది.