Congress Party : కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాలో 10కి 10ది సీట్లు కష్టమే.. ?

తెలంగాణ ఎన్నికలకు మరి ఎంతో సమయం లేదు.. ప్రధాన పార్టీ అన్ని కూడా తమ వ్యూహాలకు పదును పెడుతు.. ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతుంది. గతంలో ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగిన ఈ ఎన్నికల్లో వారి పొత్తు ఎటూ తెలకపోవడంతో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా భరిలోకి దిగుతున్నాయి. సీపీఎం కూడా ముందు ఆలోచనలతో సీపీఎం కు ఎక్కడైతే పట్టు ఉందో అక్కడే భరిలో నిల్చుంది. దీంతో కాంగ్రెస్ పార్టీల్లో ఓటమి భయంపటుకుంది.

KCR Election Campaign : కేసీఆర్ నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం..

ఇంత వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం స్థానం వేరే లెవల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి సీపీఎం పోటీ చేస్తుంది. అది కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం స్వయంగా పోటీ చేస్తున్నారు. దీంతో ఓట్లు చిలుతాయి అన్న భయం కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెన్నాడుతున్నది. కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఉన్నప్పటికీ జలగం వెంకట్రావు పార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేస్తుండటంతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నకిరేకల్‌లో సీపీఎం కారణంగా కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశంకు ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక నల్లగొండ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పోటీలో ఉండటంతో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం 10కి 10 సీట్లు గెలవాలన్నాది కాంగ్రెస్ ప్రయత్నం. కానీ మొత్తంగా కనీసం పది స్థానాల్లో కాంగ్రెస్‌ను సీపీఎం గట్టి దెబ్బ తీస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి జలగం వెంకట్రావు మధ్య త్రిముఖ పోరు నడుస్తున్నది.